top of page

నిజమైన అందం

Mar 26
2 min read

ఈ ప్రపంచం అందముకు అపారమైన ప్రాధాన్యతను ఇస్తోంది.

యవ్వనంగా ఉండాలని, ఆకర్షణీయంగా కనిపించాలని ప్రపంచములో మనుష్యులు ప్రతిరోజూ బిలియన్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు

  • స్కిన్ కేర్

  • మేకప్

  • కాస్మెటిక్స్

  • హెయిర్ స్టైలింగ్

  • ప్లాస్టిక్ సర్జరీ

  • ఫ్యాషన్ & బ్రాండ్స్

అంచనాల ప్రకారం, ప్రపంచం ప్రతిరోజూ అందం కోసం ఖర్చు చేసే మొత్తం వేల కోట్ల రూపాయలను దాటుతోంది.

ఇంత ఖర్చు ఎందుకు?

ఎందుకంటే ప్రపంచం చెబుతోంది:

“అందంగా ఉంటేనే విలువ ఉంది.”

కానీ… ఇది నిజమేనా?

అందం మన జీవితాలకు ఏం చేస్తుంది?

ప్రపంచం చూపించే అందం...

తాత్కాలికమైనది

వయస్సుతో కరిగిపోతుంది

కాలంతో మసకబారుతుంది

మరణంతో ముగిసిపోతుంది


అందంపైనే ఆధారపడి జీవించినవారి జీవితాల్లో...

అసూయ

పోలిక

అసంతృప్తి

భయం

ఆత్మీయలేమి

ఎక్కువగా కనిపిస్తాయి.

ఎందుకంటే బయట అందం మన లోపల ఉన్న ఖాళీని ఎప్పటికీ నింపలేదు.


అందం గురించి దేవుని వాక్యము ఏమి చెబుతుంది?*

దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెబుతోంది:

“అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము.” సామెతలు 31:30

ఇక్కడ వాక్యం ప్రపంచపు అందాన్ని పూర్తిగా తిరస్కరించడం కాదు,

దానికి ఉన్న సరైన స్థానాన్ని తెలియజేస్తోంది.

మరో వాక్యం ఇలా చెబుతోంది:

“జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయుననె వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,

సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావమే మీకు అలంకారముగా ఉండవలెను;

అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.” 1 పేతురు 3:3–4.


అవును దేవుడు చూసేది:

ముఖాన్ని కాదు

శరీరాన్ని కాదు

వస్త్రాలను కాదు

దేవుడు చూసేది హృదయాన్ని.


నిజమైన అందం అంటే:

పవిత్రమైన హృదయం

వినయము

ప్రేమ

క్షమ

విధేయత


ఈ అందం

కాలంతో తగ్గదు

పరిస్థితులతో మారదు

మరణంతో ముగియదు

ఇది నిత్యమైన అందం.

దేవుడే నిజమైన అందము

దేవుడే అందానికి మూలము.

అందం ఆయన సృష్టి మాత్రమే కాదు, ఆయనే అందము.

దేవుని రూపము - అందమైన రూపము

ఆయన ప్రకాశము - నిజమైన వెలుగు

ప్రకటన గ్రంథంలో ఆయన రూపం ఇలా వర్ణించబడింది:

  • పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము

  • బంగారు దట్టితో కట్టబడిన రొమ్ము

  • తెల్లని ఉన్ని, హిమమంత ధవళమైన తలవెండ్రుకలు

  • అగ్ని జ్వాలలవంటి నేత్రములు

  • కొలిమిలో మెరయు అపరంజివంటి పాదములు

  • విస్తార జలప్రవాహముల ధ్వనివంటి కంఠ స్వరం

  • నోటినుండి బయలుదేరే రెండంచులుగల ఖడ్గము (పరిశుద్ధ వాక్యం)

  • ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను

-ప్రకటన 1:14–16


ప్రపంచం ఇచ్చే అందం క్షణికమైనది.

దేవుడు ఇచ్చే అందం నిత్యమైనది...

దేవుని అందం నిత్యమైనది... దేవుడు కోరుకునే అందము నిత్యమైనది...

హృదయ అందమే దేవుని దృష్టికి గొప్పది.


ఒక ప్రార్థనతో:

కీర్తనలు 31:16

నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపుము.


ఒక కోరికతో:

కీర్తనలు 17:15

నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతో నా ఆశను తీర్చుకొందును.


-Elisha Bonnke

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page