భక్తి అనగా ఏమిటి ?

భక్తి అంటే ఏమిటి?
భక్తి అంటే
కానుకలు ఇవ్వడమా?
పాటలు పాడడమా?
ఆరాధన నడిపించడమా?
వాక్యము చెప్పడమా?
మందిరానికి వెళ్లడమా?
పాస్టర్ గారికి సహాయం చేయడమా?
ఇవి అన్నీ భక్తిలో భాగములు కావచ్చు,
కాని ఇవే భక్తి కాదు.
భక్తి యొక్క అసలైన అర్థము:
భక్తి అన్న పదము గ్రీకు భాషలోని
εὐσέβεια (యూసెబియా / యుసేవియా – Eusebeia)
అన్న పదం నుండి వచ్చింది.
εὐσέβεια (Eusebeia) అంటే:
Godliness / God-likeness
అంటే
దేవునిలా ఉండడము
దేవుని స్వభావాన్ని ప్రతిబింబించడము
భక్తి అనగా కేవలం దేవుని గురించి మాట్లాడటం కాదు,
దేవునివలె జీవించుట.
భక్తి కనిపించే ప్రాంతాలు
భక్తి మన జీవితంలోని ప్రతి కోణంలో కనబడాలి:
మాటలలో
విధేయతలో
క్రమంలో
ప్రేమించుటలో
చూచుటలో
క్షమించుటలో
ఆలోచించుటలో
నడవడికలో
అంటే,
ఆరాధన సమయానికి మాత్రమే కాదు, రోజువారీ జీవితం అంతటిలో భక్తి ప్రతిఫలించాలి.
భక్తి + సంతుష్టి = గొప్ప లాభము
పరిశుద్ధ వాక్యము ఇలా చెబుతుంది:
“సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైయున్నది” 1 తిమోతికి 6:6
భక్తిలో సంతుష్టి లేకపోతే,
ఆ భక్తి సంపూర్ణమైనది కాదు.
*లోకసంబంధ సంతుష్టి*
ఈ లోకంలో చాలామంది
కొన్ని పరిస్థితుల ఆధారంగా సంతుష్టిగా ఉంటారు:
డబ్బు వచ్చినప్పుడు
ఉద్యోగం వచ్చినప్పుడు
పేరు, గౌరవం వచ్చినప్పుడు
ఈ సందర్భాలలో
వారి హావభావాలలో సంతుష్టి కనిపిస్తుంది.
కాని ఇది పరిస్థితులపై ఆధారపడిన సంతుష్టి, ఇది శాశ్వతమైనది కాదు.
దేవుని పిల్లల సంతుష్టి
దేవుని పిల్లల సంతుష్టి
పరిస్థితుల మీద కాదు.
దేవునిని కలిగి ఉండడమే వారి సంతుష్టి
దేవునితో సంబంధమే వారి సంపద
ఇదే
సంతుష్టి సహితమైన దైవభక్తి.
ధనవంతుడైన అధికారి – భక్తి ఉన్నా సంతుష్టి లేదు
లూకా 18 అధ్యాయంలో
ధనవంతుడైన అధికారి:
ధర్మశాస్త్రాన్ని పాటించాడు
ఆజ్ఞలను గౌరవించాడు
కాని అతని హృదయం
ధనముపై నిలిచింది.
“నీకు ఇంకొకటి కొదువగా నున్నది…” (లూకా 18:22)
అని యేసు చెప్పినప్పుడు,
అతడు సంతుష్టి సహితమైన భక్తిలోనికి రాలేకపోయాడు.
భక్తి ఉన్నా,
సంతుష్టిగా యేసును వెంబడించలేకపోయాడు.
లాజరు – లోకంలో ఏమీ లేకపోయినా భక్తి ఉన్నవాడు
లూకా 16లో లాజరు:
దరిద్రుడు
రోగి
తిరస్కరింపబడినవాడు
ఈ లోకంలో అతనికి ఏమీ లేదు.
కాని అతనిలో ఉన్నది:
సంతుష్టి సహితమైన భక్తి
అదే భక్తి, అతడు ఈ లోకాన్ని విడిచిన తర్వాత
అబ్రహాము రొమ్మున ఆనుకునేంత గొప్ప లాభసాధనమైంది.

అవును:
భక్తి అనగా
కేవలం క్రియలు చేయుట కాదు,
దేవుని స్వభావంతో జీవించుట.
సంతుష్టి లేని భక్తి
భారంగా మారుతుంది.
కాని
సంతుష్టి సహితమైన దైవభక్తి
ఈ లోకంలో శాంతిని,
పరలోకంలో మహిమను అందిస్తుంది.
దేవునిని కలిగి ఉండడమే మన సంతుష్టి
దేవునివలె జీవించడమే మన భక్తి
అదే
గొప్ప లాభసాధనము.
-Elisha Bonnke




Comments