The Power "NO"
"No" (కాదు/వద్దు) అనే రెండక్షరాల పదం వినడానికి చిన్నదే కావొచ్చు, కానీ జీవితంలో దీనికి ఉన్న విలువ అనంతం.
ప్రతి "No" వెనుక ఒక స్పష్టమైన "Yes" (లక్ష్యం పట్ల నిబద్ధత) దాగి ఉంటుంది.
చాలామంది "No" చెప్పడాన్ని అహంకారంగానో లేదా మొరటుతనంగానో భావిస్తారు. కానీ నిజానికి:
అనవసరమైన పనులకు 'వద్దు' అని చెప్పినప్పుడే, అవసరమైన పనులకు సమయం దొరుకుతుంది.

మన విలువలకు విరుద్ధమైన విషయాలకు 'నో' చెప్పడం మన వ్యక్తిత్వాన్ని కాపాడుతుంది.
వంద ఆకర్షణలకు 'కాదు' అని చెప్పగలిగితేనే, ఒక గమ్యాన్ని చేరుకోగలం.
స్టీవ్ జాబ్స్: ఆపిల్ సంస్థ విజయం గురించి ఆయన చెబుతూ, "మేము వెయ్యి మంచి ఐడియాలకు 'నో' చెప్పాం, అందుకే అత్యుత్తమమైన దాన్ని ఇవ్వగలిగాం" అన్నారు.
"No" చెప్పడం అంత సులభం కాదు. దానికి కొన్ని లక్షణాలు ఉండాలి:
స్పష్టత (Clarity): మన జీవిత ఉద్దేశం ఏంటో తెలిస్తేనే, అడ్డువచ్చే వాటిని తిరస్కరించగలం.
ధైర్యం (Courage): అవతలి వారు ఏమనుకుంటారో అనే భయాన్ని వీడాలి.
క్రమశిక్షణ: క్షణికానందాన్ని ఇచ్చే ప్రలోభాలకు దూరంగా ఉండే మానసిక స్థితి ఉండాలి.
పరిశుద్ధ గ్రంథంలో విశ్వాస వీరుల విజయాలు వారు చెప్పిన "No" మీదనే ఆధారపడి ఉన్నాయి.
యోసేపు: పోతీఫరు భార్య పాపపు పిలుపునిచ్చినప్పుడు, యోసేపు "నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము చేయుదునా?" అని ఖచ్చితంగా 'నో' చెప్పాడు. అది అతడిని ఐగుప్తుకు ప్రధానమంత్రిని చేసింది.
షద్రకు మేషాకు అబేద్నెగో నెబుకద్నెజరు నిలబెట్టిన బంగారు విగ్రహానికి నమస్కరించమని కోరినప్పుడు, వారు ప్రాణాలకు తెగించి "రాజా, మేము నీ దేవతలను పూజింపము" అని 'నో' చెప్పారు. ఇది వీరిని బబులోను విచారణకర్తలుగా నిలబెట్టింది
యేసుక్రీస్తు ప్రభువు: అరణ్యంలో సాతాను శోధించి అనేక ప్రలోభాలకు గురి చేసినప్పుడు, యేసు ప్రభువు వాక్యంతో "నో" అని జవాబిచ్చారు.
ఆత్మీయ జీవితంలో "No" చెప్పడం అంటే మన పాత స్వభావాములో మనం మరణించాం అని అర్థం.
లోకపు ఆశలకు, శరీర ఇచ్చలకు 'నో' చెప్పినప్పుడే దేవుని చిత్తానికి మనం సిద్ధపడతాం. పాపపు ఆలోచన తలుపు తట్టినప్పుడు 'వద్దు' అని చెప్పడమే ఆత్మీయ విజయం, నీతి కోసం సౌకర్యాలను వదులుకోవడం (Saying No to Comfort) గొప్ప ఆత్మీయ పరిపక్వత.

"నో" - ఒక నిశ్శబ్ద విజయం
లోకపు ప్రలోభం లొంగదీయ చూస్తే.. గుండె లోతుల్లోంచి రావాలి - "నో"!
పాపపు పలకరింపు పతనం వైపు లాగితే..
ఖచ్చితంగా పలకాలి - "నో"!
అందరూ వెళ్లే దారి అధర్మం అయితే..
ఒంటరిగానైనా నిలబడి చెప్పాలి - "నో"!
నీ విలువను తగ్గించే ఏ బంధానికైనా..
ధైర్యంగా వినిపించాలి - "నో"!
శరీర ఇచ్చలకు చెప్పే "నో"..
ఆత్మీయ ఎదుగుదలకు మొదటి మెట్టు!
లోకపు ఆశలకు చెప్పే "నో"..
పరలోక రాజ్యానికి అది రాజమార్గం!
"ఒక వెయ్యి చిన్న విషయాలకు 'నో' అని చెప్పగలిగినప్పుడే, మన జీవితంలో అత్యంత ముఖ్యమైన దానికి 'అవును' అని చెప్పే అవకాశం లభిస్తుంది."
"మనుషులను సంతోషపెట్టడానికి 'అవును' అని చెప్పి నీ మనశ్శాంతిని కోల్పోవడం కంటే, నీ విలువలను కాపాడుకోవడానికి 'నో' అని చెప్పడం మిన్న."
"విశ్వాసం అంటే కేవలం దేవుని నమ్మడం మాత్రమే కాదు, దేవునికి విరోధమైన ప్రతిదానికీ 'నో' చెప్పడం కూడా."
"నీ 'నో' లో నిజాయితీ లేకపోతే, నీ 'అవును' కి విలువ ఉండదు."
బైబిలులో అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లు: "మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి (Saying No to ungodliness), ఈ లోకములో స్వస్థబుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలెను" (తీతుకు 2:12).
మన జీవితంలో మనం దేనికి "No" చెబుతామో, అదే మన ప్రార్థన జీవితాన్ని, పరిశుద్ధతను నిర్ణయిస్తుంది.
-Elisha Bonnke




Comments