365 రోజులు కూడా...
- Elisha Bonnke
- Jan 24
- 1 min read
చాలామందికి పరిచయమైనటువంటి వృక్షము ప్రాముఖ్యంగా క్రైస్తవులకు బాగా పరిచయమున్న వృక్షము ఖర్జూర వృక్షము.
కరెన్సీ మీద ఈ వృక్షం యొక్క ముద్రను బట్టి, దుబాయిలో సంపన్నులు నివాసం ఉంటున్న Palm Jumeirah అనే ఒక సిటీ వంటి వాటిలో ఈ వృక్షం యొక్క విశిష్టతను చూడగలము.
ఔషధ లక్షణాలు కలిగిన వృక్షము, రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పండ్లను ఇవ్వగలిగే వృక్షము ఖర్జూర వృక్షము.
ఇంతటి శ్రేష్టత కలిగిన ఈ ఖర్జూర వృక్షము ఎక్కువగా నిర్మానుష్య ప్రదేశాలలో, ఎడారులలో, కొండలలో, దిబ్బలలో నీరు లేని ప్రదేశాలలో ఎదుగుతూ ఉంటాయి.
అనుకూలతలో మాత్రమే కొన్ని వృక్షములు ఫలించగలవు గాని ప్రతికూలతలో కూడా ఫలించగలిగే వృక్షాలలో ఒక శ్రేష్టమైన వృక్షము ఖర్జూర వృక్షము.
సంవత్సరమంత ఉపయోగపడగలిగే వృక్షము ఖర్జూర వృక్షం, ఇట్టి వృక్షముతో పోల్చబడినవారు ధన్యులు.
బలురక్కసి చెట్లతో, ముండ్లపొదలతో పోల్చబడిన మనుష్యులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు, అయితే ఖర్జూర వృక్షముతో నీతిమంతుడు పోల్చబడ్డాడు.
కీర్తనలు 92:12
నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్వువేయు దురు.
గమనిద్దాం..
ప్రతికూలతలో కూడా ఫలించగలిగే వాడు క్రైస్తవుడు
అన్ని సమయాలలో ప్రయోజకుడు క్రైస్తవుడు
రుచికరమైన అనుభవమును ఇవ్వగలిగినవాడు క్రైస్తవుడు
ఔషధ లక్షణాలు కలిగిన వాడు క్రైస్తవుడు
*జ్ఞాపకం చేసుకుందాం*
మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులలో అనుకూలమైన మొవ్వు వెయ్యగలిగిన వాడే క్రైస్తవుడు.
దేవుని పిల్లలుముగా యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఈ దన్యతను పొందుకున్నవారము మనము.
యెహోవా మందిరములో నాటబడ్డము
దేవుని మందిరంలో వర్ధిల్లుతున్నాం
దేవుని ఘనతను ప్రసిద్ధి చేయువారము
ముసలితనమందు కూడా పచ్చగా ఉన్నవారు నీతిమంతులు.
కీర్తనలు 92: 12 - 15
ఇట్టి నీతి గలవారమై అన్ని పరిస్థితిలలో ఫలవంతముగా ప్రయోజనకరముగా మనమందరము వర్ధిల్లుదాము.
-Elisha Bonnke




Comments