రాజీ పడని జీవితం
- Elisha Bonnke
- 4 days ago
- 2 min read

A. W. టోజర్ (Aiden Wilson Tozer, 1897 - 1963) ఒక ప్రముఖ క్రైస్తవ రచయిత, బోధకుడు, ఆత్మీయ తత్త్వవేత్త. Christian and Missionary Alliance (C&MA) యొక్క పరిచారకుడు.
దేవునితో వ్యక్తిగత సన్నిహిత సంబంధంపై గట్టి బోధ, బాహ్య మతాచారాలకంటే అంతర్మనసు మార్పుకి ప్రాధాన్యం, ఆధునిక క్రైస్తవత్వంలోని ఆత్మీయ నిర్లక్ష్యాన్ని నిర్భయంగా ప్రశ్నించిన వ్యక్తి ఆయన.
ఆయన:
The Knowledge of the Holy
The Pursuit of God
The Root of the Righteous
Man: The Dwelling Place of God
వంటి ఆత్మీయ గ్రంథాల రచనల ద్వారా క్రైస్తవ విశ్వాసాన్ని మేల్కొల్పారు.
A. W. Tozer ఆత్మీయ బోధలోని అనేక మందిని తాకిన ఒక మాట:
“A compromised Christian is equal to no Christian.” – A. W. Tozer.
("రాజీపడిన క్రైస్తవుడు ఏ క్రైస్తవుడితోనూ సమానం కాదు.")
ఈ రోజుల్లో దేవుణ్ణి నమ్మే వారు చాలా మంది ఉన్నారు…
కానీ దేవునితో నడిచే వారు చాలా తక్కువ మంది.
ఎందుకంటే మన విశ్వాస జీవితం క్రమంగా రాజీ పడే జీవితంగా మారిపోయింది.
పాపంతో రాజీ…
లోకంతో రాజీ…
సౌకర్యాలతో రాజీ…
మన “నేను”తో రాజీ…
మనుషులతో రాజీ.
రాజీ పడే జీవితం కొరకు దేవుడు పిలువలేదు, రాజీ పడని జీవితం కొరకే దేవుడు మనలను పిలుచుకున్నారు.
A.W. Tozer గారు పెద్ద బైబిల్ కాలేజీలో చదవలేదు.
పెద్ద డిగ్రీలు లేవు.
కానీ దేవుని సన్నిధిని కోరుకున్న హృదయము ఆయనకు ఉంది, లోకపు గుర్తింపు కన్నా
దేవుని అనుభవాన్ని కోరుకున్న వ్యక్తి ఆయన.
అందుకే ఆయన అన్నాడు
“దేవుని గురించి తెలిసిన జ్ఞానం కన్నా
దేవునితో ఉన్న సంబంధమే ముఖ్యము.”
రాజీ మొదలయ్యే స్థలం:

మన జీవితాల్లో రాజీ ఎక్కడ మొదలవుతుంది తెలుసా?
ప్రార్థన తగ్గిన రోజు
వాక్యం చదవడం అలసటగా అనిపించిన రోజు
పాపాన్ని చిన్నదిగా చూసిన రోజు
దేవుని సన్నిధిని, సహవాసమును నిర్లక్ష్యం చేసిన రోజు
A.W. Tozer గారు స్పష్టంగా చెప్పారు:
“దేవుడు మన జీవితాల్లో ప్రధాన స్థానం కోల్పోతే,
మన విశ్వాసం మతముగా మారుతుంది.”
ఈ రోజు చాలామంది క్రైస్తవులు నామకార్థ (మత) క్రైస్తవులు అయిపోయారు, క్రీస్తుతో జీవించే వారు తక్కువ అయిపోయారు.
యేసును వెంబడించుటలో సిలువ అనుభవము లేని క్రైస్తవులుగా ఉన్నారు
రాజీ పడని జీవితం అంటే:
దేవుడు చెప్పిందే చివరి మాట...
సత్యం కోసం నిలబడటం...
లోకం తృణీకరించిన, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టకపోవడం...
సౌకర్యం కన్నా సమర్పణను ఎంచుకోవడం...
సులభమైన మార్గము కాకుండ సిలువ మార్గమును ఎంచుకోవడమే.
పరిశుద్ధ గ్రంథంలో:
పాపంతో రాజీపడని యోసేపు:
నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందును.. ఆది 39:9
అపవిత్రతతో రాజీ పడని దానియేలు:
రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, దాని 1:8
ప్రార్థన విషయంలో రాజీ పడని దానియేలు:
ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలుభ తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లి, యధా ప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దాని 6:10
దేవుని మాట విషయంలో రాజీ పడని అపొస్తలులు:
అందుకు పేతురును అపొస్తలులును మనుష్యు లకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా.అపొ. కా 5:29
కుటుంబముగా దేవుని సేవించుటకు రాజీపడని యెహోషువ:
యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవిం చెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరె వరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను. యెహోషువ 24:15
ఇది రాజీ పడని క్రైస్తవుల జాబితా..
ఈ జాబితాలో నీవు ఉండాలి నేను ఉండాలి అని కోరుకుంటూ..
-Elisha Bonnke




Comments