top of page

ప్రాధాన్యత

చాలామంది క్రైస్తవులకు పరిచయమున్న ఎరిక్ లిడెల్ జీవితం నుండి ఒక విశ్వాస పాఠం.


ఎరిక్ లిడెల్ (Eric Liddell) స్కాట్లాండ్ దేశానికి చెందిన ఒక ప్రసిద్ధ ఒలింపిక్ అథ్లెట్.

ప్రపంచం అతన్ని గొప్ప క్రీడాకారుడుగా చూసింది,

కానీ అతని జీవితానికి కేంద్రబిందువు దేవుడు మాత్రమే.

అతడు చెప్పిన మాటలు అతని హృదయాన్ని తెలియజేస్తాయి:

“నేను పరుగెత్తినప్పుడు దేవుడు సంతోషిస్తాడు.”

పరుగులు అతని ప్రతిభ అయినా, దేవుని సన్నిధే అతనికి మొదటి ప్రాధాన్యత.


ఆదివారం - ఒక నిర్ణయం


1924 ఒలింపిక్స్‌లో ఎరిక్ లిడెల్‌కు చాలా సులభంగా పరుగెత్తాగలిగే 100 మీటర్ల పోటీ ఆదివారం రోజు పెట్టారు, అది అతని జీవితంలో అరుదైన అవకాశం.

కానీ అతడు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు:

“ఆదివారం దేవుని ఆరాధనకే.

ఆ రోజు నేను పోటీలో పాల్గొనను.” దేశం ఒత్తిడి చేసింది, ప్రజలు విమర్శించారు,

కానీ ఎరిక్ లిడెల్ వెనుకడుగు వేయలేదు.

ఈ ఒక్క నిర్ణయంతో

అతడు ప్రపంచానికి ఒక గొప్ప విశ్వాస సాక్షిగా నిలిచాడు.


మనుష్యులు ముఖ్యమా ? దేవుని సన్నిధి ముఖ్యమా ?


కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును అని ప్రభువు వాక్యము చెప్పినట్లుగా ఎరిక్ లిడెల్ జీవితంలో మనుష్యుల కన్నా, లోకము కన్నా దేవుని సన్నిధే గొప్పది.


దేవుని ఆశీర్వాదం - 400 మీటర్ల విజయం


ఆదివారం పోటీలో పాల్గొనని ఎరిక్ లిడెల్ తరువాత 400 మీటర్ల రేసులో పాల్గొన్నాడు.

అది అతనికి చాలా కఠినమైన పోటీ. కానీ దేవుడు అతని విధేయతను చూశారు, దేవుని కృపతో ప్రపంచ రికార్డుతో బంగారు పతకం సాధించాడు.

ఇది అతని బలంతో కాదు,

దేవుని ఆశీర్వాదంతో జరిగింది.

“1సమూయేలు 2:30 నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును.


ఎరిక్ లిడెల్ క్రీడా జీవితము తర్వాత విశ్రాంతి తీసుకోలేదు. చైనాకు మిషనరీగా వెళ్లి,

పిల్లల మధ్య, రోగుల మధ్య,

దుఃఖంలో ఉన్నవారి మధ్య

తన జీవితాన్ని సంపూర్ణంగా దేవుని సేవకు అర్పించాడు.

యుద్ధ ఖైదీ శిబిరంలో

కష్టాలు భరించి అక్కడే మరణించాడు, అది ఓటమి కాదు విజయవంతమైన విశ్వాస పరుగు.

“మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని..2 తిమోతికి 4:7"


మనకు ఒక ప్రశ్న


ఈ రోజుల్లో మనం

దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం?

సమయం లేదని అనుకుంటున్నామా?

పనులున్నాయని దేవుని స్థానాన్ని తగ్గిస్తున్నామా?

లోకపు ఒత్తిడికి లోనవుతున్నామా?

ఎరిక్ లిడెల్ జీవితం మనకు చెబుతుంది:

దేవుడే మొదటైతే మిగతావన్నీ సరైన సమయంలో వస్తాయి.

విధేయతలోనే నిజమైన ఆశీర్వాదం ఉంది, మన జీవితం ఒక పరుగు లాంటిది, ఎంత వేగంగా కాదు, దేని కోసం పరుగెత్తుతున్నామో అదే ముఖ్యం, దేవుని సన్నిధిని ఎంచుకున్న జీవితం ఎప్పుడూ వృథా కాదు.

లోకపు సంతోషాలు, కిరీటాలు కరిగిపోతాయి, కానీ దేవుడు ఇచ్చు బహుమానము శాశ్వతమైనది.

“విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. హెబ్రీ 11:6" విశ్వాసము ఇలాంటి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయములో కనబడుతుంది.


చివరిగా:

ఎరిక్ లిడెల్ జీవితం నుండి మనందరికీ ఒక ప్రశ్న:

మన జీవితంలో దేవుడు నిజంగా మొదటి స్థానంలో ఉన్నాడా?


-Elisha Bonnke

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page