top of page

ఒక జీవితం - అనేకులకుvప్రోత్సాహం

Dr. ప్రశాంత్ గారు (Founder & President, CIBC, AP INDIA)

చిన్నప్పటినుండి సండే స్కూల్‌లో పెరుగుతూ

దేవుని వాక్యాలను నేర్చుకున్న జీవితం.

కానీ యవ్వన దశలో, ఈ లోక సంబంధమైన సంతోషాలకు ఆకర్షింపబడి, చర్చిలో మంచిగా కనిపించే

వేషధారణ జీవితం కొనసాగిన కాలం కూడా ఉంది.

అలాంటి పరిస్థితిలో ఒక చర్చ్ సభ్యులు అన్న మాట -

“నిన్ను చూస్తే దేవదూతను చూస్తున్నట్టు ఉంటుంది”

ఆ మాట హృదయాన్ని బలంగా తాకింది.

అది వేషధారణ జీవితమునుండి బయటికి రావాలనే పశ్చాత్తాపానికి కారణమైంది.

ఆ పశ్చాత్తాపం → మారుమనస్సుకు,

మారుమనస్సు → బాప్తీస్మ సాక్ష్యానికి దారితీసింది.


చిన్న త్యాగాలు - గొప్ప సిద్ధత


చదువుకునే రోజుల్లో కాలేజీకి బస్సులో వెళ్లడానికి

తల్లిదండ్రులు ఇచ్చిన 3 లేదా 5 రూపాయలను ఆదా చేసి,

ఆ డబ్బు దేవుని పనికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో 2, 3 కిలోమీటర్లు నడుచుకుంటూ కాలేజీకి వెళ్లిన అనుభవం.

ఎవరికి తెలియకుండా రాత్రి సమయాల్లో

చర్చి బాత్రూములను శుభ్రం చేస్తూ, దేవుడు మాత్రమే చూచే విధంగా చేసిన

రహస్య పరిచర్య.

ఇంటిలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ,

భవిష్యత్తులో సదుపాయాలు లేని ప్రాంతాలకు వెళ్లి

సేవ చేయవలసి వచ్చినప్పుడు

శరీరం సుఖాలకు అలవాటు పడకూడదని, ఫ్యాన్ ఆఫ్ చేసుకుని పడుకోవడం ద్వారా

తన శరీరాన్ని కూడా దేవుని సేవకు సిద్ధపరచుకున్నారు.


ప్రార్థన జీవితం - దేవుని నడిపింపు


విశాఖపట్నం ఇంటీరియల్ ప్రాంతాలలో

ప్రతి సంవత్సరం మూడు రోజుల ఉపవాస ప్రార్థన.

అలాంటి ఉపవాస ప్రార్థనలో ఒక సంవత్సరం

దేవుని వాక్యము ద్వారా సేవకు సంబంధించిన స్పష్టమైన సూచన

ప్రభువు ఇచ్చారు.


శోధనలో విజయం - సాక్ష్య జీవితం


యోసేపు జీవితంలో ఫోతిఫరు భార్య నుండి వచ్చిన శోధన వంటి భారీ శోధన ఎదురైనప్పటికీ,

దేవుని మహా కృప వలన పాపపు ప్రేరణ నుండి తప్పించబడిన గొప్ప సాక్ష్యం

ఆయన జీవితంలో ఉంది.


నమ్మకత్వం నుండి దర్శనానికి


కొరియా నుండి వచ్చిన ఒక సంస్థ చెన్నైలో స్థాపించిన బైబిల్ కాలేజీలో డైరెక్టర్‌గా ఎంపిక చేయబడ్డారు.

అక్కడ చూపిన నమ్మకత్వమే

తనకంటూ ఒక బైబిల్ కాలేజ్ స్థాపించాలనే దేవదర్శనానికి పునాది అయింది.


సంపూర్ణ సమర్పణ


సేవలో ఉండగా వివాహం చేసుకుంటే

సేవకు స్వేచ్ఛ తగ్గిపోతుందనే ఆలోచనతో, వివాహాన్ని నిరాకరించి, ప్రభువు సేవకే సంపూర్ణంగా సమర్పించుకున్నారు.


ప్రలోభాలను తిరస్కరించిన విశ్వాసం


ఆర్థిక సహాయం చేస్తామనే ఆఫర్లు,

విదేశీ వివాహ అవకాశాలు,

బ్యాంక్ కార్డులు ఇచ్చే వరకు వచ్చిన ప్రలోభాలు - ఇటువంటి వాటిని కూడా దేవుని చిత్తానికి విరోధంగా అంగీకరించలేదు.


భౌతిక లాభం కాదు - దేవుని రాజ్యం


కొరియా భాషను బోధిస్తూ

సొంత ఇల్లు కట్టుకునే స్థాయికి వచ్చినప్పటికీ, దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా

ఒక పెద్ద బైబిల్ కాలేజ్ నిర్మాణాన్ని ఎంచుకున్నారు.

బైబిల్ కాలేజీ విస్తారమైన స్థలంలో తనకోసం కేవలం

ఒక మంచం పట్టే గది మాత్రమే కట్టుకొని, మిగతా అంతా కాలేజీకి అవసరమైన విధముగా నిర్మించారు.


బహుభాషా సువార్త - అందరికీ సువార్త


ఈ రోజు ఆయన

తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కొరియా భాషలలో

సువార్తను ప్రకటిస్తూ

భాషల పరిమితులు దాటి

దేవుని ప్రేమను అనేకులకు చేరుస్తున్నారు.


ఫలప్రదమైన సేవ రోజు


2000 మందికి పైగా విద్యార్థులను,

(Covenant International Bible College, Member of Asia Theological Association, Afflileted with Reformed Deciple's Theological Seminary, S. Korea, Accredited by International Association for Theological Accreditation

కింతాడ, K. కోటపాడు,

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా నుండి) భారతదేశంలోను ఇతర దేశాలలోను సేవ చేయడానికి అనేక మందిని ప్రభువు పనికి సిద్ధపరుస్తున్నారు.


ప్రణాళికలు దేవునివి, ఆ ప్రణాళికలను అందిపుచ్చుకునే బాధ్యత మనది.

పశ్చాత్తాపంతో, సిద్ధతతో, దీనత్వముతో, సమర్పణతో, భయభక్తులతో జీవించినప్పుడు దేవుడు మన జీవితాలను కూడా

ఇతరులకు ప్రోత్సాహముగా మారుస్తాడు.


నోవహు విషయంలో ప్రణాళిక దేవునిది, ఆ గొప్ప ప్రణాళికను అందుకొనుటకు నోవహు కృప పొందినవాడాయెను


నీవు సిద్ధంగా ఉంటే,

దేవుడు నిన్ను వాడుకుంటాడు.


2తిమోతికి 2:21

యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయైయుండాలి మనము.


-Elisha Bonnke

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page