ఒక స్పందన
మన చుట్టూ అనేకమంది కళ్ళముందే నశించిపోతున్నారు.
చూస్తూ నిలబడాలా? లేక స్పందించాలా?
ఈ ప్రశ్నకు ఈ నిజ సంఘటన మనకు బలమైన పాఠం నేర్పుతుంది.
1982 జనవరి 13
ఫ్లోరిడా ఫ్లైట్ 90 అనే విమానం వాషింగ్టన్ దగ్గర నదిలో కూలిపోయింది.
విమానంలో ఉన్న కొందరికి ఈదటం వచ్చి వారు నెమ్మదిగా బయటకు వచ్చారు.
కాని ప్రిస్సిల్లా టిరాడో అనే ఒక స్త్రీ నీటిలో కొట్టుమిట్టాడుతూ బయటకు రాలేకపోయింది.
ఒడ్డున చాలామంది చూస్తూ ఉన్నప్పటికీ,
మార్టిన్ స్కుట్నిక్ (Martin Skutnik) అనే వ్యక్తి
ఏ ట్రైనింగ్ లేకుండానే నీటిలోకి దూకి
తన ప్రాణాలను లెక్కచేయకుండా ఆమెను రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చాడు.
విలేకరులు అడిగారు “మీరు ఇలాంటి రక్షణకు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు?”
అతని సమాధానం హృదయాన్ని తాకుతుంది,
“నాకు సరిగ్గా ఈదుట కూడా రాదు. కానీ ఆమె పడుతున్న బాధను చూసి నన్ను నేను ఆపుకోలేక ఆమెను రక్షించడానికి దూకాను.”
అవును,
అది నేర్పు కాదు భారం
ట్రైనింగ్ కాదు స్పందించే హృదయం
ఈ సాహసకార్యాన్ని గుర్తించిన
అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ తన State of the Union ప్రసంగానికి
స్కుట్నిక్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు.
ఈ సంఘటన మనకు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని గుర్తుచేస్తుంది.
మనం ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాము
మన చుట్టూ పాపంలో నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు
చూస్తూ నిలబడటానికి కాదు తెగించి ముందుకు వెళ్లడానికి దేవుడు మనలను పిలిచాడు
సామెతలు 24:11
చావునకై పట్టబడినవారిని నీవు తప్పించుము నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా?
దేవుడు అడుగుతున్న ప్రశ్నకు మన సమాధానం మన చర్యలలో కనబడాలి
దానియేలు 12:3
బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.
ఆత్మలను రక్షించేవారు దేవుని దృష్టిలో నక్షత్రాలవలె విలువైనవారు
2కోరింథీ 5:14
క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది.
మనకు అన్ని సామర్థ్యాలు ఉండకపోవచ్చు, పూర్తి ట్రైనింగ్ ఉండకపోవచ్చు కానీ భారం ఉంటే చాలు.
ఒక మాట
ఒక ప్రార్థన
ఒక సహాయం
ఒక సాక్ష్యం
ఒక ఆత్మను రక్షించగలదు
మార్టిన్ స్కుట్నిక్ నీటిలోకి దూకినట్టే, మనము కూడా పాపంలో మునిగిపోతున్న ఆత్మల కోసం మన సౌకర్యాల నుండి బయటకు రావాలి.
చూస్తూ నిలబడే క్రైస్తవులు కాకుండా,
ప్రేమతో స్పందించే సేవకులుగా ఉందాం.
-Elisha Bonnke




Comments