చేతిలో Forbes...
- Elisha Bonnke
- Jan 24
- 1 min read
చేతిలో Forbes… కానీ జీవితం చేతిలో లేదు
Colman Mockler
ప్రపంచ ప్రసిద్ధ Gillette కంపెనీ CEO.
చిన్న ఉద్యోగిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి
కష్టపడి, అంకితభావంతో
ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగిన వ్యక్తి.
లోకం అతన్ని చూసి ఇలా చెప్పింది:
విజయవంతుడు
శక్తివంతుడు
సాధించినవాడు
ఒక రోజు ప్రపంచ ప్రఖ్యాత Forbes మ్యాగజైన్
Colman Mockler గారి మీద
ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించబోతోంది.
ఆ కథనం ఇంకా బయట ప్రపంచానికి రాకముందే,
ఒక నమూనా మ్యాగజైన్ ఆయనకు పంపబడింది.
ఆ మ్యాగజైన్ చేతిలో పెట్టుకొని
తనతో పనిచేసిన సిబ్బందితో
ఆనందాన్ని పంచుకుంటున్నారు.
కానీ మరుక్షణంలోనే…
👉 అతనికి గుండె నొప్పి వచ్చింది
👉 అదే అతని చివరి క్షణం
Forbes అతని చేతిలో ఉంది…
కానీ జీవితం అతని చేతిలో లేదు.
ఇలాంటి సంఘటనలను మనం చాలా విన్నాము, ఇవి కేవలం కథలు మాత్రమే కావు.
👉 ఇవి మనందరికీ దేవుడు ఇస్తున్న నిశ్శబ్ద హెచ్చరికలు.
మనము ఎంత సాధించామో కాదు, ఎంత పేరు సంపాదించామో కాదు, ఎంత కాలం జీవిస్తామో కూడా కాదు, మన ఊపిరి కూడా మన నియంత్రణలో లేదు.
ఈ లోకం ఇచ్చే పేరు, ప్రతిష్ట, పదవి, సంపద
ఒక్క క్షణంలో
మన చేతి నుంచి జారిపోవచ్చు.
ఈ లోకం ఇచ్చే గౌరవం తాత్కాలికం,
కానీ దేవునితో ఉన్న సంబంధమే
శాశ్వతమైనది.
అందుకే మనం ఒక ప్రశ్న వేసుకోవాలి:
ఈ రోజు నేను ప్రార్థన చేసుకున్నానా?
ఈ రోజు దేవుని వాక్యాన్ని చదివానా?
ఈ రోజు దేవునితో నడిచానా?
ఈ రోజు మన చేతిలో ఉన్నది
రేపటికీ ఉంటుందనే భరోసా లేదు.
కానీ ఈ రోజు దేవునితో నడిచే అవకాశం మాత్రం
మన చేతిలో ఉంది.
ప్రార్థనతో వాక్య బలముతో
మనము జీవించినప్పుడు,
మన జీవితాన్ని ఆపగలిగేలా కనిపించే మరణమూ కూడా ఓడిపోతుంది.
యాకోబు 4:14
“రేపేమి సంభవించునో మీకు తెలియదు.
మీ జీవమేపాటిది?
మీరు కొంతసేపు కనబడి
అంతలో మాయమైపోవు
ఆవిరి వంటివారే.”
జీవితం మన చేతిలో లేదు గనుక, మన జీవితాన్ని కృపగల దేవుని చేతుల్లో
అప్పగిద్దాం.
-Elisha Bonnke




Comments