దేవుని చేతిలో మన జీవితం
Head of the Christ యేసుప్రభువు ముఖచిత్రముగా ప్రపంచమంతా గుర్తించిన ఈ చిత్రాన్ని చిత్రించిన వ్యక్తి
వార్నర్ సాల్మన్ (1892–1968).
అమెరికాలో ప్రఖ్యాతిగాంచిన ఈ చిత్రకారుడు వేసిన ఆ చిత్రం ఆ దినాల్లోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయింది.
ఇప్పటికీ అనేకమంది ఆ ముఖచిత్రాన్ని చూసి
“ఇదే ప్రభువు ముఖం” అని గుర్తు చేసుకుంటారు.
అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం:
మన విశ్వాసంలో విగ్రహాలకు గానీ, బొమ్మలకు గానీ ప్రాధాన్యత లేదు.
ప్రభువును ఆత్మతోను సత్యంతోను ఆరాధించడమే నిజమైన విశ్వాసం.
(యోహాను 4:24)
జీవితాన్ని కుదిపేసిన వార్త
1917లో, వివాహమైన కొద్ది రోజులకే
వార్నర్ సాల్మన్ అనారోగ్యంతో డాక్టర్‌ను సంప్రదించాడు.
పరీక్షల తర్వాత డాక్టర్లు చెప్పిన మాట: “మీకు టీబీ వ్యాధి ఉంది.
వ్యాధి చాలా ముదిరింది.
మీరు మూడు నెలలు మించి బ్రతకడం కష్టం.” ఈ మాటలు విన్న వార్నర్ సాల్మన్
భయంతో, ఆందోళనతో ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని తన భార్యకు చెప్పాడు, ఆమె అప్పటికే గర్భవతి.
విశ్వాసంతో తీసుకున్న నిర్ణయం
ఆ వార్త విన్నప్పుడు ఆమె కూడా క్షణం ఆందోళన చెందింది.
కానీ వెంటనే తేరుకుని గొప్ప విశ్వాసంతో ఇలా చెప్పింది:
“దేవుడు మనకు మూడు నెలల ఆయుష్షు ఇచ్చాడంటే
దానికి ముందుగా కృతజ్ఞత చెప్పుదాం.
ఈ మూడు నెలలు ఎంతగా ప్రార్థించగలమో అంతగా ప్రార్థించుదాం.
ఈ మూడు నెలలు ఆయన చిత్తమైతే దేవుని సేవ చేద్దాం.
ఈ మూడు నెలల్లో ఆయనకిష్టమైతే
స్వస్థపరచమని అడుగుదాం.”
పరిస్థితిని చూసి భయపడలేదు,
సమయాన్ని చూసి నిరాశపడలేదు,
దేవుని చిత్తంపై ఆశ పెట్టుకుంది.
“ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. రోమా 10:11
కృతజ్ఞతతో, ప్రార్థనతో, నిరీక్షణతో
ఆ మూడు నెలలు వారు కృతజ్ఞతతో, ప్రార్థనతో, సేవతో, నిరీక్షణతో ముందుకు సాగారు.
మూడు నెలల తర్వాత… ఆరు నెలలు… ఒక సంవత్సరం…
ఇలా కాలం గడిచింది.
డాక్టర్లు చెప్పిన మాటలు నెరవేరలేదు,“నా కాలగతులు నీ వశములో నున్నవి. కీర్తనలు 31:15" అన్న దేవుని వాక్యం నెరవేరింది.
దేవుని అద్భుతం
1917లో “మూడు నెలలే” అన్న జీవితము 1968 వరకు, దాదాపు 50 సంవత్సరాలకు పైగా దీర్ఘాయుష్షుతో కొనసాగింది. ఇది వైద్య అంచనా కాదు… దేవుని అనుగ్రహం.
మనము లెక్క వేసేది ఒకటి అయితే, దేవుడు జరిగించేది మాత్రం ఆయన చిత్తమే.
మనం పరిమితిని చూస్తాం, దేవుడు చూస్తారు ఆయన ఉద్దేశాన్నే.
“నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కురు.”యెషయా 55:8
గుర్తుంచుకో... నీ జీవితము దేవుని చేతిలో ఉంది, నీ మీద సార్వభౌమాధికారం ఆయనదే.
-Elisha Bonnke




Comments