top of page

నీవే ఒక ప్రసార సాధనం

Feb 5
2 min read

ఒకప్పుడు ప్రపంచం అంతా

CRT (క్యాథోడ్ రే ట్యూబ్) అనే ఒక ట్యూబ్‌పై ఆధారపడి ఉండేది. ఒక వాక్యూమ్ గ్లాస్ ట్యూబ్ నుండి ప్రసారమయ్యే దృశ్యం అప్పటి టెలివిజన్.

ఒక గదిలో ఒకే టీవీ,

కొన్నే చానెల్స్, కొంతమంది మాత్రమే మాట్లాడేవారు,

మిగిలినవారు నిశ్శబ్దంగా వినేవారు.


కానీ కాలం మారింది.

YouTube వంటి వేదికలు వచ్చాయి. అందులో ముఖ్యంగా YouTube...

నీ సందేశం నీ దగ్గర నుండే రావాలని, నీ వార్త నీవే చెప్పాలని,”నీకు ఒక చానల్ ఉండాలని" ప్రసారం ఇక స్టూడియోలో కాదు, వ్యక్తిలో ఉండాలనే ఉద్దేశమును YouTube స్థాపకులు గ్రహించారు.


"YouTube” అంటే ప్రతి వ్యక్తి (You) తనకు నచ్చిన ప్రసారమును టీవీలా (Tube) చూపగలగే వేదిక.

ఇప్పుడు ప్రసారం ఒక ట్యూబ్‌లో లేదు, ఒక వ్యక్తిలో ఉంది, ప్రస్తుతం లోకము ప్రతి మనిషిని ఒక ప్రసార సాధనంగా వాడుకుంటుంది.


👉 అయితే దేవుడు:

ఈ లోకములో టవర్స్‌ను కాదు, స్టూడియోలను కాదు, టెక్నాలజీని కాదు.

మనల్ని, నిన్ను, నన్ను, ప్రసార సాధనాలుగా ఎంచుకున్నాడు.

ఆ ఎన్నుకోబడిన వారి పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసమునుండియు వచ్చు సారమే ఉపదేశ ప్రసారము. (1తిమోతికి 1:5)


పరిశుద్ధ గ్రంథంలో

మోషే ఒక మనుష్యుడు, దేవుని పిలుపు వచ్చినప్పుడు మోషే ఆన్నాడు.

“ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా (నిర్గమకాండము 4:10)

దేవుడు అన్నారు:

“యెహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగవానినేగాని, చెవిటివానినేగాని, దృష్టిగలవానినేగాని, గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా.

కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను.” (నిర్గమకాండము 4:10, 11)


మన యోగ్యతలు కాదు, మన జ్ఞానము కాదు, మన మాటకారితనము కాదు.

మనము దేవునికి అందుబాటులో ఉంటే చాలు, ఈ లోకంలో ఉన్న ఏ ట్యూబ్లు ఇవ్వలేని పరిశుద్ధ సారమును ఇచ్చే సాధనాలుగా దేవుడు వాడుకుంటారు.


అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని యిర్మియా అన్నప్పుడు” (యిర్మియా 1:6)

*దేవుడు ఏమన్నారు ?*

“నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్పవలెను.

వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను; ఇదే యెహోవా వాక్కు.” యిర్మియా 1 :7,8.


మన బలం వలన కాదు,

నీ ప్రతిభ వలన కాదు,

మన నోటిలో ఉంచబడిన దేవుని వాక్యం వలనే, ఆ వాక్యం క్రీస్తే.

హెబ్రీ 1:2 ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను.


విద్యలేని పామరులని, సామాన్యులను దేవుడు సాధనములుగా వాడుకున్నారు (అపొ. కా 4:13), వారు యేసుతో ఉన్నవారని ప్రజలు గ్రహించారు.

వారికి స్టేజ్ లేదు, మైక్ లేదు, కెమెరా లేదు కానీ పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది.

అందుకే వారి స్వరం

యెరూషలేము నుండి

భూదిగంతాల వరకు వినబడింది.


భూదిగంతముల వరకు వాడబడగలిగే సాధనాలు దేవుడు ఏర్పరచుకున్న ప్రసార సాధనములు.


నీవే Tube


రాతిపలక మీదగాని సిరాతో గాని వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకల మీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయైయున్నారని మీరు తేటపరచబడుచున్నారు. 2 కోరింథీ 3:3.


చివరిగా ఒక ప్రశ్న మనము ఎవరికి సంబంధించిన ప్రసార సాధనాలము ?

మన ద్వారా ఏ సందేశం ప్రసారమవుతోంది ?


జ్ఞాపకం చేసుకుందాం

“మీరు లోకమునకు వెలుగై ఉన్నారు” మత్తయి 5:14.


వెలిగిన వెలుగు వెలుగును ప్రసారం చేస్తుంది.

వెలిగింపబడిన మనం వెలుగును ప్రసారము చేయాలి.


ఆమెన్


-Elisha Bonnke

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page