హీరో
- oelishabonnke
- Nov 20, 2024
- 1 min read
హీరో అనే ఈ పదము పరిచయం లేని వారు ఎవరు ఈ ప్రపంచంలో లేదు. పరిచయం ఉన్నా చాలామందికి ఈ పదం యొక్క అర్థం తెలియదు. తెర మీద నటిస్తున్న నటులే హీరోలు అన్నట్టుగ హీరో అనే పదము పట్టబడింది. నిజానికి తెరమీద నటిస్తున్న వారు హీరోలుగా నటిస్తారు గానీ హీరోలు కాదు.
హీరో అనే పదమునకు డిక్షనరీ ఇస్తున్న వివరణ ఈ విధముగా ఉంది.
a person who is admired for their courage, outstanding achievements, or noble qualities.
ధైర్య సాహసాలు చూపించగలిగే వాడు హీరో, అసాధారణమైన విషయాలను సాధించగలిగినవాడు హీరో లేదా అతీతమైన అర్హతలు కలిగిన వాడు హీరో.
ఈ ప్రపంచంలో ఈ లక్షణాలు కలిగిన వారిలో ప్రధముడు మన యేసయ్య, ఇక్కడ ఆయన దైవత్వమును గూర్చి మాట్లాడుకోవడం లేదు, ఆయన కూడా ఒక మనుష్యూనిగా ఈ భూమి మీద జీవించి ఆ జీవితంలో చూపిన అసాధారణమైన హీరోయిజం కొరకు మాట్లాడుకుంటున్నాము.
ప్రపంచానికి ఆయన ఇచ్చిన ఒక సవాల్ నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు. ఈ పిలుపులో హీరోయిజం కనిపిస్తుంది. భూమి మీద ఉన్న ఏ మనుష్యుడు కూడా ఈ సవాల్ చేయలేకపోయారు, చేయలేరు కూడా. That is the heroism of Jesus Christ.
చాలామంది హీరోలుగా నటిస్తున్న వారిని అనుసరిస్తారు, వారిలా ఉండాలని అనుకుంటారు, వారిలా బట్టలు వేసుకోవాలని, వారిలా స్టైల్ చేయాలని వారిలా మాట్లాడాలని, వారిలా నడవాలని అనుకుంటారు. కానీ వారందరూ నటన చేస్తున్నారు నటనను అనుసరించేది నటనే అయిపోతాది.
యేసుప్రభువు నిజమైన హీరో అని గుర్తించిన వారు ఆయనలా ఉండాలని ఆయనలా బ్రతకాలని ఆయనలా ప్రేమించాలని ఆయన హీరోయిజమును అంది పుచ్చుకోవాలని కోరుకుంటారు, అందుకే యేసుప్రభువును నమ్ముకున్న వారు ఆయనను విడిచిపెట్టలేరు, ఆయన గొప్పతనము కొరకు చెప్పకుండా ఉండలేరు.
మన ప్రభువే మనకు మాదిరి, ఆయన వైపు చూచుచు వెళ్లవలసిన జీవితాలు మనవి, ఆయనలా బ్రతకాలి.
క్రీస్తును పోలి నడుచుకున్న పౌలు ఇస్తున్న పిలుపు
1కోరింథీ 11:1
నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.



Comments