top of page

Quo vadis ? ఎక్కడికి వెళుతున్నావు ?

రోమ్ నుండి బయటకు వెళ్ళు అప్పియన్ మార్గంలో ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్ పేరు (QUO VADIS) కో-వాడిస్ చాపెల్. ఈ చర్చ్ నిర్మించుటకు గల ముఖ్య కారణమును చరిత్ర ఈ విధముగా వివరిస్తూ ఉన్నది.


మన ప్రభువైన యేసుక్రీస్తు మరణానంతరము సువార్త నిమిత్తము రోములో అడుగు పెట్టిన పేతురు క్రూరమైన కత్తియుద్ధలు కలిగిన వాతావరణంలో, క్రూరమైన జంతువులకు ఖైదీలను వేయడం ఆ జంతువులు వారిని సంహరించడము, దానిని చూసి ఆనందించే జనులు మద్య సువార్తను ప్రకటించి, మద్యపానం, బహుభార్యత్వం, వ్యభిచారం, భానిసత్వం, మొదలగు దుర్గుణములు గల ఆ జనులను పేతురు మార్చుటకు విఫలమయి అప్పియన్ మార్గంలో తన పాదధూళిని దులిపివేసి ఇక్కడ ఎంత కష్టపడినా వారిని మార్చలేము అన్న నిరాశతో ఆ నగరమును విడిచి తిరిగి వెళుతుఃడాగా మార్గంలో ప్రభువు అతనికి ప్రత్యక్షమై కో-వా డేస్ అని ప్రశ్నించెను. ఈ లాటిన్ మాటకు నీవు ఎక్కడికి వెళుతున్నావు అని అర్థం, పేతురు రోములో ఎదురైన పరిస్థితిని వివరించి అక్కడ నుండి తిరిగి వెళుతున్నాను అని చెప్పి అదే ప్రశ్న కో-వాడిస్ అని ప్రభువును పేతురు కూడ ప్రశ్నించెను. దానికి ప్రభువు పేతురుకు ఇచ్చిన జవాబు రోములో నేను మరలా సిలువ వేయబడుటకు వెళుతున్నాను అని చెప్పారు. ప్రభువు పలికిన ఈ మాటకు స్పందించిన పేతురు మేల్కొని తన తప్పిదమును ఒప్పుకొని మరల రోములోకి తిరిగి వెళ్ళి అక్కడే సువార్త నిమిత్తం హతసాక్షిగా ప్రభువు కొరకు తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు.


అలుపెరగని పోరాటం దేవుడు తన పిల్లలనుండి కోరుకుంటున్నారు. అంతమువరకు పోరాటమును, అంతమువరకు సహనమును, అంతము వరకు జాగ్రత్తలను వహించవలసినవారమైయున్నాం.


ప్రకటన2:10 మరణమువరకు(లేక-ప్రాణాపాయము వచ్చినను) నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను.


అపోస్తులుడైన పౌలుగారు చెప్పిన మాట యావత్తు క్రైస్తవ సమాజం యొక్క మాటయై యుండాలని కోరుకుందాం.

కొలస్సీ1:24

ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను.


Elisha Bonnke

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page