top of page

అత్తా కోడళ్ళు...

ఇండియాలో కుటుంబ కలహాలకు ప్రధానమైన కారణాలు కొన్ని ఉన్నాయి అందులో ఆస్తులు, దురాశలు, అనుమానాలు, ఆర్భాటాలు, డాంబికము వంటి వాటిని గణాంకాలుగా చెబుతుండగా.. వీటిని అన్నిటిని అధిగమించే ఒక ప్రధానమైన కారణము అత్తా కోడళ్ళా బంధం. ఇది యావత్తు ఇండియాను ప్రభావితం చేస్తున్న ఒక భయంకరమైన దురాత్మ అని చెప్పవచ్చు. ఎంత మంచి కోడలు ఇంటికి కోడలుగా వచ్చినప్పటికీ, ఎంత మంచి అత్త తన జీవితంలో అత్తగా దొరికినప్పటికీ అంతవరకు ఉన్న మంచితనము అంతవరకు ఉన్న గొప్పతనము ఎగిరిపోయి కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపడేంతగా అత్త కోడళ్ళ మధ్య వ్యత్యాసాలు కనబడుతున్నాయి, తద్వారా అది కుటుంబ సభ్యులలో విభేదాలను సృష్టిస్తూ అనేక విధములుగా కుటుంబాలు విడిపోవడానికి కారణం అవుతుంది.


నిజానికి అత్త మరియు కోడలు అనే ఈ రెండు అనుభవములను ఎదుర్కోవలసినవారు స్త్రీలు. ఎక్కడో పుట్టి, పెరిగి వివాహ అనంతరం అత్తవారింటిలో అడుగుపెట్టిన కుమార్తెకు అత్త కుటుంబం ఎంత భరోసాని ఇవ్వాలి, కానీ దానికి అతీతముగా నీచముగా చూడడము, అణగిమణిగి ఉండాలనుకోవడం, సేవలు చెయ్యాలి అని ఒక సేవకురాలుగా చూడడము వంటివి ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. అదే సమయంలో వచ్చిన కోడలు కూడా ఇంటిలో నాదే పెత్తనం అవ్వాలి, నేనే ఈ ఇంటికి యజమానురాలను అనే గర్వముతో ఈర్ష్యతో అత్తను మావలను, కుటుంబ సభ్యులను హీనముగా చూడటం కూడా మనము గమనిస్తున్నాము. ఇటువంటి వైఖరి వలన కుటుంబాలను ఏలుబడి చేయవలసిన ఆనందము దూరమైపోతుంది.


కోడలను కూతురు కన్నా ఎక్కువగా చూసుకోవాలి, అత్తను అమ్మ కన్నా ఎక్కువగా చూసుకోవాలి. కూతురుకి ఏదైనా ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆణచి, కుదించి దిగజారునట్లు తల్లులు ఇస్తారు కదా, మరెందుకు కోడలు విషయంలో ఆ ప్రేమను చూపించలేకపోతున్నారు. అమ్మవారి ఇంటికి కూతురు సంతోషముతో అన్ని విధాల ప్రేమను పంచడానికి సిద్ధంగా ఉంటుంది కానీ అత్తవారింటికి ఆ సంతోష ప్రేమలను చూపించడానికి చాలా కష్టపడుతున్నారు కోడళ్ళు.


పరిశుద్ధ గ్రంథములో అత్తను ప్రేమించి అత్తను హత్తుకునే రూతు, మరియు కోడలను ప్రేమించి కోడల క్షేమము కొరకు పరితపించే నయోమి మనకందరికీ సుపరిచితమే. కుటుంబమంతా కోల్పోయినప్పుడు వారిద్దరి మధ్య ఉన్న ఆత్మీయ బంధం వారి జీవితాలకు గొప్ప వెలుగును తీసుకువచ్చింది.


ఈ దినాలలో దీనికి భిన్నంగా అత్తా కోడళ్ళ వ్యవహారం మన సమాజంలో మనం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా మన భారతదేశంలో నూటికి 97% అత్త కోడల మధ్య విభేదాలు కలిగిన వారు ఎక్కువగా ఉన్నారు. కానీ ఓ మూడు శాతం మంది అతను తల్లిలా... కోడలను కూతురులా చూసుకునే వారు ఉన్నారు. ఆ మూడు శాతములో ఈ భాగమును చదువుతున్న వారి కుంభాలలో ఎంతమంది ఉన్నారు.


మనము దేవుని పిల్లలము, దేవుడు కోరుకునే కుటుంబ వ్యవస్థను మనము కలిగి నేనును, నా ఇంటి వారును అన్న దేవుని మాటలో మన కుటుంబ సభ్యులందరూ ఉండాలి అది కొందరికే పరిమితం కాకూడదు. రక్షింపబడిన కుటుంబాలుగా ఈ మాటను ఒప్పుకొని, ఈ మాటానుసారముగా ప్రార్థన చేస్తూ, కుటుంబమును ఒక చిన్న పరలోకముగా చేసుకుందాము.


యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవిం చెదరో నేడు మీరు కోరుకొనుడి;


లోకమంతా ఎలా ఉన్నా..


మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను. యెహోషువ 24:15


ఆమెన్


Elisha Bonnke

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page