అనుమానము భయంకరమైన వినాశనమునకు మార్గమైంది.
- oelishabonnke
- Nov 13, 2024
- 1 min read
ఇది నిజముగా జరిగిన ఓ సంఘటన.
శ్వేతా అనే ఒక అమ్మాయి ఒక ఇంటికి కోడలుగా వెళ్ళిన తరువాత కొన్ని రోజులకు... కోడలు తన అత్త ఇంటిలో ఉండగా శ్వేత మొబైలుకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, అవతల వ్యక్తి మాట్లాడుతూ మీరు ఎవరు అని అడిగిన వెంటనే నేను శ్వేతను మీకు ఎవరు కావాలి అని రిప్లై ఇచ్చింది, ఇది విన్న అవతల వ్యక్తి శ్వేత నీ వాయిస్ చాలా బాగుంది అని మొదలు పెట్టగానే శ్వేతా ఫోను కట్ చేసి చేసింది. అవతల వ్యక్తి ఆ ఫోనుకు మాటిమాటికి ఫోను చేయడం శ్వేత ఆ ఫోనును కట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఉదాంతం చూస్తున్న అత్తగారికి అనుమానం కలిగింది ఒక వారం రోజుల తర్వాత ఫోన్ వస్తున్న సమయంలో అత్తగారు ఆ ఫోను రిసీవ్ చేసుకున్నారు, అవతల వ్యక్తి శ్వేత ఎందుకు నాతో మాట్లాడటం లేదు, ఫోను ఎందుకు కట్ చేస్తున్నావు అని చెప్పడంతో అత్తగారు చాలా కోపముతో కోడలను కొట్టి, ఉద్యోగములో ఉన్న తన కొడుకును పిలిపించి జరిగిన పరిస్థితి చెప్పిన వెంటనే భర్త మొబైల్ లో అవతల వ్యక్తి పెట్టిన మెసేజులు చూసి మరింత కోపావేశుడై శ్వేతా వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారు, ఏమైందో అన్న ఖంగారుతో వాళ్ళ అన్నయ్య ఇంటికి చేరుకున్నారు జరిగిన పరిస్థితి వాళ్ళ అన్నయ్యకు వివరించగానే చెల్లి కోసం తెలిసిన అన్నయ్య ఆ పరిస్థితి కోసం నిదానముగా మాట్లాడుతుండగా మరలా ఫోను వచ్చింది, ఇప్పుడు వాళ్ళ అన్నయ్య ఫోను రిసీవ్ చేసుకున్నాడు, అవతల వ్యక్తి శ్వేతా ప్లీజ్ మాట్లాడు అనే మాట వినగానే అన్నయ్య కోపావేశుడై తన తుపాకీని తీసి తన చెల్లిని మూడు సార్లు కాల్చి చంపేసాడు. ఈ పరిస్థితిని పోలీసులు గమనించి నిజానిజాలు బయటకు రాబట్టగా అనుమానమునకు అపార్థమునకు గురైన అత్త, భర్త, అన్నయ్య జరిగిన పొరపాటును భట్టి కుమిలిపోయారు.
యోహాను 10:10
దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును.
అపవాది మనలో మంచితనమును, సమాధానమును, ఆనందమును దొంగిలించి తద్వారా మన మనస్సాక్షిని హత్య చేసి చివరిగా నాశనములోకి నడిపించడం వాని ఉద్దేశం, క్రైస్తవులుముగా దీన్ని గుర్తించినవారమై అపవాది తంత్రములను ఎదుర్కోగలిగినవారమైయుండాలి, ఏ విధమైన శోధనకు ఎడమియ్యకూడదు.
కీర్తనలు 23:1
యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.
కీర్తనలు 23:6
నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును.
Elisha Bonnke


Comments