top of page

ఆరాధన దేవున్ని సంతోషపెట్టేది...

ఆరాధనలో సాధారణముగా ఈ రోజు నేను చాల హ్యాపీ అయ్యాను, ఈ రోజు ఆరాధన చాల భాగుంది, ఈ పాట పాడితే బావున్ను, అతను నడిపిస్తే బావున్ను ఈయన వాక్యం చెపితే బావున్ను అన్న మాటలు అన్న భావములను చుస్తూ ఉంటాము.


గుర్తుంచుకుందాము ఆరాధన భట్టి ఈ రోజు దేవున్ని సంతోష పెట్టగలిగాను, ప్రతి పాటను ఆయనకు తగినవిధముగా పాడగలిగాను, ఎవరు ఆయన పక్షముగ నిలవబడినా దేవుని నడిపింపు మీదే దృష్టి పెట్టగలిగాను, అన్న మాటలు అన్న భావన మనలో ఉండగలగాలి.


దేవున్ని సంతోషపెట్టగలిగిదే ఆరాధన, దేవుని ముఖములో నవ్వును చూడగలిగిన మనుష్యుడైన, సంఘమైన, పట్టణాలైన,దేశాలైన దీవెనలతో నింపబడగలుగుతాయి.


అనుకూలతలో ప్రతికూలతలో ప్రభువును ఘనపరచగలిగేదే ఆరాధన.


కొలస్సీ 1:10 - 12

ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞాన మందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,

ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు,

తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను(అనేక ప్రాచీన ప్రతులలో-మిమ్మును అని పాఠాంతరము) పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము.


Elisha Bonnke.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page