top of page

క్రియలు లేని నమ్మిక దయ్యం నమ్మిక...

1) దేవుని మాటకు రూపము

ఉంది.

యోహాను1:1

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.


2) దేవుడు పలికిన ప్రతీ మాట క్రియ రూపకమును దాల్చింది,

దేవుడు సృష్టిని కలుగునుగాక అని పలికారు, ఆ పలుకు క్రియను సృష్టి రూపములో చూస్తున్నాము.


3) శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్న మాట యేసయ్య సిలువ త్యాగములో చుపించారు.


ప్రార్థనలో, ఆరధనలో, ప్రేమించుటలో పలుకుతున్న మాటలు ఎన్ని ఉన్నా... క్రియలు లేని ప్రార్థననుండి జవాబులను ఆశించలేము, క్రియలు లేని ఆరాధన దేవున్ని సంతోషపెట్టలేదు, క్రియలు లేని ప్రేమ ఆదరించలేదు.


క్రియశీలుడైన మన దేవుడు, ఆయన పిల్లలుముగా మన నుండి కోరుకుంటుంది క్రియలతో కూడిన విశ్వాసము.

విశ్వసించువాడే ప్రార్థన చెయ్యగలడు.

విశ్వసించువాడే ఆరాధించగలడు.

విశ్వసించువాడే ప్రేమించగలడు.


ప్రభువునందు విశ్వసించువారు లోక ప్రయాణనంతరము ప్రభువును ఎదుర్కొన్నప్పుడు వారి వెంట వారి క్రియలు వచ్చునని వాక్యము సెలవిస్తుంది.


రోమ2:6

ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.

ప్రకటన14:13

అంతట ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.

యిర్మియా 31:16

యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడుఏడువక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము; నీ క్రియసఫలమై, జనులు శత్రువుని దేశములోనుండి తిరిగి వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు.


యాకోబు2:18

అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి; క్రియలు లేకుండ నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు కనుపరతునని చెప్పును.


దయ్యములకు నమ్మిక ఉన్నప్పటికీ క్రియలు ఉండవు, క్రియలు లేని నమ్మిక దయ్యముల నమ్మిక.


యాకోబు2:19

దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగునమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి.

యాకోబు2:15,16,17

సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనములేకయున్నప్పుడు.

మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?

ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.


మన నమ్మిక దయ్యముల వంటి నమ్మిక కాకూడదు, క్రియలు కలిగిన నమ్మిక అయి ఉండాలి.


Elisha Bonnke

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page