top of page

చేతిలో బైబిల్ చేతల్లోనూ బైబిలే...

ఒక ఉన్నతమయిన ఉద్యోగ హోదాలో ఉన్న ఒక సేవకుడు మెరయుచున్న సుందరమైన బైబిలును చేత పట్టుకొని ఆ సమయంలో విశాఖపట్టణములో జరుగుచున్న సభలకు హజరు అవుటకు ఆటో రిక్షాలో ప్రయాణము చేస్తున్నాడు.

ఆ ఆటోలో తనతో పాటు ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. మార్గ మధ్యలో ఆటో నడుపుతున్న డ్రైవరుకు ఫోన్ వచ్చింది, రింగు అవుతున్న తన మొబైల్ ఫోనును ఈ యవ్వనస్థుని చేతికిచ్చి నేను ఫొన్ మీ దగ్గర వదిలేసానని, మీరు మాట్లాడాలనుకున్న ఆయన ఇప్పుడు నా దగ్గర లేడని చెప్పమన్నాడు. దానికి ఆ సేవకుడు నన్ను క్షమించండి నేను అబద్ధము ఆడను అని బదులిచ్చాడు. ఆ మాటను వింతగా చూసిన ఆ ఆటో డ్రైవర్ మీరు ఎప్పుడు అబద్ధము ఆడరా అని అడిగాడు, అవును ఆడను అని ఆ సేవకుడు బదులిచ్చాడు. జరగుతున్న ఈ సందర్బము తోడి ప్రయాణికులకు ఆశర్యము కలిగించింది, మరియు క్రైస్తవుని విలువ ఏమిటో చూపించింది.

ఆ సందర్భములో తను సువార్త చెప్పలేదు, బోధించలేదు గాని తన చేతిలో ఉన్న బైబిలుకు తగినట్లుగా తన ప్రవర్తనను వెదజల్లుతూ ఉంటే ఏ మాత్రము సందేహము లేదు ఆ డ్రైవరుకు మరియు ప్రయాణికులుకు యేసు యొక్క గొప్పతనమును గూర్చిన ఆలోచన వచ్చి ఉంటుంది.

దేవుని వాక్యమును కలిగి ఉన్నవారముగా మన చేతిలో ఉన్న బైబిలుకు తగ్గట్లుగా మన చేతల్లోనూ ఉండగలిగినప్పుడు చాలా సులభముగా దైవత్వమును వెదజల్లగలము.

2 కోరింథీ 3:2 మనుష్యులందరు తెలిసికొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరేకారా?


2 కోరింథీ 2:15

మేము దేవునికి క్రీస్తు సువాసనయైయున్నాము.


Elisha Bonnke

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page