జీవించడానికి ఓ దన్ను...
- oelishabonnke
- Nov 24, 2024
- 2 min read
UK కు చెందిన బాల్మోరల్ సిటీలో డారిల్ అతని భార్య జానీస్ ఆల్సన్, పాప బ్రాక్ట్రిస్ కుమారుడు లీలాండ్ ఈ నలుగురితో కూడిన చిన్న కుటుంబములో జరిగిన సందర్భము ఆ దినాలలో పెద్ద వార్త అయింది.
ఇక అంశములోనికి వస్తే భార్యకు తొలి ప్రెగ్నెన్సీ సమయములో విపరీతమైన నడుమునొప్పి మొదలైంది, ఆ నొప్పి గర్బవతి కావడమువలన వచ్చిందేమో అని అనుకున్నారు. నెలలు నిండాక నొప్పి మరింత తీవ్రత దాల్చినందువలన వైద్యులు పెయిన్ కిల్లర్స్ ఇచ్చి నెట్టుకొచ్చారు, మొడటి కాన్పు అయినతరువాత నొప్పి ఉందిగానీ ఇంతకుముందుకన్నా పర్వాలేదులే అని మందులతో మూడు సంవత్సరములు నెట్టుకొచ్చారు.
తరువాత మరలా రెండవసారి ప్రెగ్నెన్సీ, ఈ సారి నొప్పి నరకాన్ని చూపించింది, కూర్చోలేదు, నిలువబడలేదు, పడుకున్న భరించలేని నొప్పి. ఏడవనెల వచ్చినప్పటికి ఎన్ని పెయిన్ కిల్లర్స్ వాడుతున్న ఏ మాత్రం తగ్గకపోవడముతో నాకు అబార్షన్ చేయండి అంటూ ఆమె డాక్టర్లును బ్రతిమలాడింది, డాక్టర్స్ ఇప్పుడు సాధ్యము కాదు కొంచెం ఓర్చుకోమని పెయిన్ రిలీఫ్ కోసం రకరకాల చికిత్సలు, మసాజులు, టిప్స్ వంటి ప్రయత్నాలు చేసినా ఫలితము లేదు.
చివరకిి నిండు గర్భవతిగా ఉన్న తాను నడవలేని స్థితిలోకి వచ్చి నేలపై పసిపిల్లలా దోగాడుతూ తిరిగేది, ఎట్టకేలకు రెండవ బిడ్డకు తల్లి అయింది.
డెలివరీ తరువాత డాక్టర్లు ఆమెకు పరిక్ష మీద పరీక్షలు చేసి చివరిగా నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ చేసాక ఆమెకు కొండ్రోసార్కోమా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు కనుకున్నారు. ఆ వ్యాధివలన దిగువ వెన్నుముక కాళ్ళ కండరాలు, కాళ్ళ ఎముకలు అన్నీ కాన్సర్ మయమయ్యాయి, ఎన్ని చికిత్సలు చేసినా ఫలితము లేదని గ్రహించిన డాక్టర్లు, దానికి నడుమునుండి క్రింద భాగము అంతా సర్జరీ ద్వారా తొలిగించడము కన్న వేరే మార్గము లేదన్నారు, అంటే శరీరమును రెండు ముక్కలు చేయాలి, దీనికి బయపడిన ఆ కుటుంబము వేరే మార్గము లేక ఒప్పుకున్నారు. డాక్టర్లు ఆపరేషన్ చేసి మల మూత్ర విసర్జనకు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.
ఇప్పుడు మొండెముతో అంటే సగము శరీరముతో జీవితాన్ని ప్రారంభించిన ఆమె ఒక రోజు ఒక వార్త పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పిన మాట, ఇలాంటి దుర్బల పరిస్తితులను ఎదుర్కొని ఇలా మొండెముతో ఉన్న నేను ఇంకా బ్రతకగలుగుతున్నానంటే నా వెన్నంటే ఉండి నన్ను కరుణతో చూసుకుంటున్న నా భర్తే కారణము అని చెప్పింది. ఆమె చెప్పిన ఈ మాట
ఆ దినాలలో ఒక సంచలన వార్తగా ప్రచురించబడింది.
చాల మంది జీవితాలలో దుర్బల పరిస్తితులు ఎదురైనప్పుడు చనిపోయినా బావున్ను అనుకుంటారు, కొందరు చనిపోతున్నారు కూడ.
జానీస్ఆల్సన్ తన జీవితములో దుర్బల పరిస్తితులు ఎదురయినా తన భర్త ధన్నుతో జీవించగలిగినప్పుడు, పరలోకపు తండ్రి, సృష్టికర్తయిన భర్త, ఈ లోకంలో ప్రేమబంధాలకు మూలమైన మన దేవుడే మనకు ధన్నుగా ఉండగా మనమెందుకు భయపడాలి, ఏ పరిస్థితుల్లోనూ కృంగిపోకూడదు, నిరుత్సాహపడకూడదు, చనిపోయినా బావున్ను అని అనుకోకూడదు. నీలో ఉన్నవాడు గొప్పవాడు 1యోహాను4:4
చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు,
ఆయన నిన్ను జీవింపజేస్తాడు యోహాను10:10
దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
Elisha Bonnke



Comments