top of page

దేవుడు ఎందుకు మనలను అపజయాల గుండా నడిపిస్తాడు.. ?

బైబిలులో మోషే, యోసేపు, దానియేలు, దావీదు వంటి వారు అపజయాల మార్గములో నడిచి తిరిగి గొప్ప విజయాలు పొందుకున్నారు.


విలియమ్ కేరి, థామస్ ఎడిషన్ వంటి గొప్ప వ్యక్తులు అనేకులు అపజయాల గుండా వెళ్లి గొప్ప విజయ పరంపరను అందుకున్నారు.


దేవుడు ఎందుకు అపజయాలు మన జీవితంలో అనుమతిస్తారు, కొన్ని కారణాలు జ్ఞాపకం చేసుకుందాం.


1) మనలను దీనులుగా చేయుటకు..

(అన్నిటిలోని విజయాలు గుండా వెళితే మనలో గర్వం పెరిగిపోతుంది)


2) మనలను తెలివైన వారిగా చేయుటకు..

(ఓడిపోయిన తర్వాత ఇంకా తెలివిగా చేయాలి అన్న తపన ఉంటుంది)


3) మనలను కనికరము గల వారిగా చేయుటకు..

(కష్టపడి విజయమును సంపాదించుకున్నప్పుడు, పడిన కష్టం కనికర మనసుతో నింపుతుంది)


4) సలహాదారులుగా తయారు చేయుటకు..

(అపజయాల గుండా వెళ్లేవారికి సలహాదారులుగా ఉండుటకు)


5) ఆదరణ కలిగించే వారిగా చేయుటకు..

(అపజయాలలో ఉన్న వారిని ఆ బాధ తెలిసిన వారిగా వారిని ఆదరించుటకు)


👉 40 సంవత్సరముల తర్ఫీదులో మోషే, 13 సంవత్సరాల ఓటమిలో యోసేపు, 15 సంవత్సరాలు తరుమబడుటలో దావీదు, బబులోను చెరలో దానియేలు మరియు ఎస్తేరుల వంటి వారు, కుటుంబములో సమాజములో ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొన్న విలియం కేరి వంటి వారు..‌

ఇలా అనేకమంది అపజయాల తర్వాత గొప్ప విజయాలు పొందుకున్నారు.

వారు పొందుకున్న విజయాలలో గర్వం లేనివారుగా, సలహాదారులుగా, దీనులుగా, ఆదరించువారుగా, ధైర్యము చెప్పే వారిగా అనేక మందిని ప్రోత్సహపరిచే సాధనాలుగా ప్రజ్వలించారు.


దీని వెనుక దేవుడు జరిగించిన పని ఉంది.


యాకోబు 1:13

దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడునేను దేవుని చేత శోధింప బడుచున్నానని అనకూడదు.


1పేతురు 1:7

నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.


2కోరింథీ 1:4

దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.


Elisha Bonnke


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page