top of page

దేవున్ని ప్రార్థించుటకు సరైన రోజు... ఏది ?

ఒకదినమున ఒక బాలుడు ఒక పెద్దాయనను ఈ ప్రశ్న వేసాడు, అయ్యా దేవున్ని ప్రార్థించుటకు సరైన రోజు ఏది అని. అందుకు ఆ పెద్దాయన ఆలోచించి, నీవు చనిపోయే ముందు రోజు దేవునికి ప్రార్థన చేయడానికి సరైన రోజని జవాబు ఇచ్చారు.‌ దానికి ఆ అబ్బాయి మరి నేను చనిపోయే రోజు నాకెలా తెలుస్తాది అని అడిగాడు. అవును ఏ రోజు మనము చనిపొతామో మనకు తెలియదు గనుక ప్రతిరోజు మనము దేవున్ని సేవించాలి అని ఆ పెద్దయన బదులిచ్చారు.

మార్కు 13:33

జాగ్రత్తపడుడి; మెలకువగానుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు.


ఈ అంశమును చదువుతున్నవరకే ఏమి జరిగిందో మనకు తెలుసు. తరువాత క్షణాలు మన చెతిలో లేవు.

యాకోబు4:14

రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.

కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను.


మంచాల భారిన పడియున్నవారు, మరణావస్థలో ఉన్నవారు సాధారణముగా చేసే ప్రార్థన... ప్రభువా నన్ను లేవనెత్తు.. బ్రతికి నీ సేవ చేసుకుంటాను, మీ కొరకే బ్రతుకుతాను అని. ఈ ప్రార్థన ఆరోగ్యముగ ఉన్నప్పుడు అన్ని బావున్నప్పుడు మనము చేయగలిగితే దేవునికి ఎంతో మహిమకరము.

ప్రసంగి 12:1,2

దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే,

తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.


కొలస్సీ4:2

ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి.


2పేతురు 3:18 ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్‌.


Elisha Bonnke

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page