దేవుని సేవకుడంటే మన దృష్టిలో***
- oelishabonnke
- Nov 28, 2024
- 1 min read
లౌకిక జ్ఞానం పెరుగుతున్న ఈ దినాలలో కుటుంబ వ్యవస్థలో, ఉద్యోగ వ్యవస్థలో, సమాజ వ్యవస్థలో జ్ఞానం యొక్క నడిపింపు ఎంత అవసరమో.. విశ్వాస ప్రయాణము నడిపింపబడుటకు పరసంబంధమైన జ్ఞానం అంతకన్నా అవసరం. పూర్వము ఈ జ్ఞానం
నానాసమయములలో నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులకు అనుగ్రహింపబడింది.
ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా ఆ జ్ఞానం మనకు అనుగ్రహింపబడింది. హెబ్రీ1:1,2.
ప్రధానయాజకునిగా మన ప్రియ ప్రభువైన యేసయ్య ఆ జ్ఞానమును క్రొత్తనిబంధనలో పిలువబడినివారిగా అర్దమునిచ్చే అపోస్తులలుకు అనుగ్రహించారు. ఆ అపోస్తులలోనుండి ప్రవక్తలుగా, ఉపదేశుకులుగా, కాపరులుగా, సువార్తికులుగా ఆయన సేవకులను ఆయ సమయాలలో నిర్ణయించి పరిశుద్ధులు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగుటకు ఆయన ఈలాగు నియమించెను. ఎఫెసీ4:12.
ఇట్టి అముల్యమైన పరసంబంధమైన ఙ్ఞానమును అందించుటకు దేవుడేర్పరచుకున్న సేవకులు రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను.1తిమోతి 5:17.
ఈ దినాలలో దేవుని సేవకుడంటే కొంతమంది చులకనగాను, కొంతమంది అవసరాలకొరకు అన్నట్లుగా చూస్తారు.
దేవుడు తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని సేవకులను గూర్చి
చెప్పుచున్నాడు. హెబ్రీ1:7.
దేవుని సేవకుడైన ఎలీషాను ఒకసారి బోడివాడు బోడివాడు అన్న పిల్లలు ఎలుగుబంట్లద్వారా చీల్చబడ్డారు 2రాజులు2:23,24.
దేవుని సేవకుడైన ఏలీయాను బందిద్దామనుకున్న ఆహాబు సేవకులు అగ్నిపాలయ్యారు 2రాజులు1:10.
దేవుని సేవకుడైన పేతురు దగ్గర అబద్ధమాడిన అననీయ సప్పీరాలు అక్కడక్కడే చనిపోయారు. అపో.కా 5:1-10.
ఇట్టి మహోన్నతుని సేవకుల పక్షమున విధేయతను వ్యక్తపరుచుట ప్రాముఖ్యమైనది ఏం చేయవలెను.
సేవకుని ఘనపరచిన షూనేమీయురాలు దైవాశీర్వాదాలు పొందుకున్నాది 2రాజులు4:8-37.
ఎన్నో శ్రమలు ఉన్నా విశ్వాసమును అందిస్తూ విశ్వాసములో స్థిరపరుస్తున్నారు దేవునిసేవకులు.
అపోస్తులుడైన పౌలు గారు ఈ అనుభవమును తన పత్రికలో వివరించారు 2కోరింథీ 6:4-10
మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు డకలుగజేయక శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలలోను అల్లరులలోను ప్రయాస ములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పుగలవారమై,
పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమతోను
సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల నీతి ఆయుధములు కలిగి,
ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమైయుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై నట్లుండియు సత్యవంతులము; తెలియబడనివారమైనట్లుండియు బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింపబడినవారమైనట్లుండియు చంపబడనివారము;
దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.
ఇంతగా ప్రయాస పడుతున్న దేవుని సేవకులను భట్టి దేవున్ని ఘనపరుస్తు ప్రభువు చిత్తమును నెరవేర్చిన వారమైయుందాము.
సర్వమును భట్టి దేవున్ని మహిమపరుస్తూ...



Comments