దైవావేశము
- oelishabonnke
- Nov 15, 2024
- 1 min read
..ప్రతిలేఖనము దైవాదేశము వలన కలిగి.. 2తిమోతికి 3:16
మన తెలుగు బాషా నానుడిలో "ఆవేశము" అన్న సంధర్బములో నుండి వచ్చిన ఏ పనికైనా అంత విలువ ఉండదు, ఆవేశములో జరిగిపోయింది పట్టించుకోవద్దనో, ఆవేశములొ చేసేసారు క్షమించమనో, వాడికి అవేశము ఎక్కువా.. వాణ్ణి పట్టించుకుంటారేమిటి అన్న చులకన భావాలకు ఈ పదమును ఎక్కువుగా ఉపయోగిస్తుంటారు.
అయితే బైబిల్ పుట్టుకకు మూలమైన దైవావేశము అన్న పదమునకు ప్రత్యేకత ఉంది. దైవావేశము అన్న ఈ మాట "THEOPHEUSTOS " అన్న గ్రీకు పదమునుండి వచ్చింది, దీని అర్ధము దేవుడు తన శ్వాస వాయువును ఊదెను (GOD - BREATHED)
మనలను ఖండించి, మనకు బుద్ధిచెప్పి, మనలను సరిచేయగల లేఖనములు దేవుని ఊపిరి నుండి వచ్చినవి, అది దేవుడు మన పట్ల కలిగియున్న తృష్ణ లేక తపన.
లేఖనములను సమీపించినవారు దేవుని శ్వాసను, ఊపిరిని అందుకోగలుగుతారు.
దేవుని ఊపిరి మనలను మరణకరమైన పరిస్థితులలో జీవింపచేయగల శక్తి గలది,
యోబు 33:4
దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను
ఈ జీవమును అందించగల దేవుని వాక్యమును ధ్యానిస్తూ దైవ జీవములో మనము వర్ధిల్లుదుముగాక.
2తిమోతికి 3:16,17
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము(ప్రతిలేఖనము దైవాదేశము వలన కలిగి) ఉపదేశించుటకును,
ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది.
ఆమెన్



Comments