నీతిమంతుల జ్ణాపకాలు
- Elisha Bonnke
- Jan 30
- 2 min read
గ్రహం స్టెయిన్ (Graham Staines) ఆస్ట్రేలియాకు చెందిన ఒక క్రైస్తవ మిషనరీ.
భారతదేశాన్ని తన రెండవ స్వదేశంగా భావించి, సుమారు 34 సంవత్సరాలు అంకితభావంతో సేవ చేసిన వ్యక్తి.
ఆయన సేవ యొక్క కేంద్రబిందువు:
కుష్టు రోగులు
సమాజం తిరస్కరించిన వారికి ప్రేమించడం
క్రీస్తు ప్రేమను కార్యరూపంలో చూపడం
గ్రహం స్టెయిన్ గారు మాటలకంటే జీవితముతో సువార్తను ప్రకటించిన సేవకుడు.
గ్రహం స్టెయిన్ గారు తన భార్య గ్లాడిస్ స్టెయిన్ (Gladys Staines) గారితో కలిసి భారత్‌కు వచ్చారు.
వారికి ముగ్గురు పిల్లలు:
ఎస్తేరు స్టెయిన్
ఫిలిప్ స్టెయిన్
తిమోతి స్టెయిన్
ఈ కుటుంబము విశ్వాసంతో, సాదాసీదా జీవితం గడుపుతూ, భారత గ్రామీణ ప్రజల మధ్య జీవించింది.
ఒడిశా (అప్పటి ఒరిస్సా) రాష్ట్రంలో, ముఖ్యంగా:
బరిపడా (Baripada)
మనోహర్పూర్ ప్రాంతంలో కుష్టు రోగుల మధ్య సేవ చేశారు.
వారు:
ఆసుపత్రులు నిర్మించలేదు
పేరు కోసం సేవ చేయలేదు
కానీ, తిరస్కరించబడిన వారిని ఆలింగనం చేసుకున్నారు, ఈ ప్రేమే ఆయన జీవిత సాక్ష్యం.
1999 జనవరి 22 & 23 అర్ధరాత్రిలో గ్రహం స్టెయిన్ గారు తన ఇద్దరు చిన్న కుమారులు ఫిలిప్, తిమోతిలతో కలిసి ఒక కూడికకు వెళ్లారు, రాత్రి ఆలస్యమవడంతో, వారు జీప్‌లోనే నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో తీవ్రవాదుల గుంపు జీప్‌ను చుట్టుముట్టి జీప్‌కు నిప్పంటించారు
ఆ రాత్రి తండ్రి ఇద్దరు చిన్న పిల్లలు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన ప్రపంచాన్ని కదిలించింది.
చనిపోయిన తర్వాత భార్య గ్లాడిస్ స్టెయిన్ గారి క్షమాపణ గొప్ప చరిత్ర. భర్తను, ఇద్దరు కుమారులను కోల్పోయిన గ్లాడిస్ స్టెయిన్ గారి మాటలు చరిత్రలో నిలిచిపోయాయి:
“నా భర్తను చంపిన వారిని నేను క్షమించాను.
వారిపట్ల నాకు ద్వేషం లేదు.”
ఇది సాధారణ మానవశక్తితో సాధ్యమైన మాట కాదు, ఇది క్రీస్తు ఆత్మ కలిగించిన క్షమాపణ.
ఆమె:
దేశాన్ని విడిచిపెట్టలేదు, సేవను ఆపలేదు.
అదే కుష్టు రోగుల మధ్య సేవను కొనసాగించారు, ఆమె క్షమించిన క్షమాపణే శక్తివంతమైన సువార్త సాక్ష్యమైంది. 2004లో క్రిస్టియానిటీ టుడే (Christianity Today) పత్రిక
“మదర్ థెరీసా తరువాత భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన క్రైస్తవ మహిళ”గా గ్లాడిస్ స్టెయిన్ గారిని వర్ణించింది. 2005లో, భారత ప్రభుత్వము ఆమెకు ప్రతిష్ఠాత్మకమైన పౌర పురస్కారం అయిన పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.
ప్రస్తుతం గ్లాడిస్ స్టెయిన్ గారు కుమార్తె యొక్క చదువు తదితరు విషయాలను ఆస్ట్రేలియాలో దగ్గరుండి చూసుకుంటున్నారు, అవసరమైనప్పుడు ఆయా కార్యక్రమాల నిమిత్తము భారతదేశమునకు వస్తున్నారు
ఈ హత్యకు ప్రధాన నిందితుడు ధారాసింగ్ (Dara Singh), జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో:
అతడు బైబిల్ చదవడం ప్రారంభించాడు. యేసు గురించి తెలుసుకున్నాడు, తన జీవితం గురించి ఆలోచించాడు, తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు:
“గ్లాడిస్ స్టెయిన్ క్షమాపణ నన్ను కదిలించింది.”
ద్వేషంతో మొదలైన జీవితం
ప్రేమతో ప్రశ్నించబడింది
క్షమాపణ ద్వారా హృదయం కరిగింది
ఇది యేసు ప్రేమ యొక్క శక్తి ఆని
నీతిమంతుని జ్ఞాపకం మనకు ఇచ్చే ప్రేరణ, గ్రహం స్టెయిన్ గారి చరిత్ర మనకు నేర్పేది
సేవ అంటే సౌకర్యం కాదు, త్యాగం
విశ్వాసం అంటే మాటలు కాదు, జీవితం
క్షమాపణ అంటే దేవుని సువార్త శక్తి
మరణం కూడా సువార్తను ఆపలేను
ముగింపు మాట: గ్రహం స్టెయిన్ గారు చనిపోయారు,
కానీ ఆయన జీవితం ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంది.
ఆయన రక్తసాక్ష్యం ద్వారా అనేకులు క్రీస్తును రుచి చూశారు, అనేక హృదయాలు మారాయి, ఈ చరిత్ర సువార్తకు వేదిక అయింది.
ఈ నీతిమంతుని జీవితం అనేకులకు ప్రేరణ
సామెతలు 10:7
“నీతిమంతుని జ్ఞాపకం ఆశీర్వాదకరము”
నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము. ఫిలిప్పీ 1:21
-Elisha Bonnke




Comments