నిన్ను గుర్తించే స్థలం...
- oelishabonnke
- Nov 27, 2024
- 3 min read
ఈ లోకంలో ప్రతిదానికి ఎంతోకొంత విలువ ఉండడం గమనించిన ఒక అబ్బాయి తన జీవితము యొక్క విలువ ఎంత అయి ఉంటుందో అని తెలుసుకోవాలనుకున్నాడు.
ఒకరోజు తన తండ్రిని డాడీ నా జీవితం విలువ ఎంతో నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు కన్న తండ్రిగా ఏమైనా నా గురించి చెప్పగలరా అని అడిగినప్పుడు, ధనవంతుడైన తండ్రి ఆలోచించి ఒక రాయిని తన కుమారుని చేతిలో పెట్టి నీవు సిగ్గుపడకుండా వెళ్లి మన మార్కెట్ బయట ఒక చిన్న గుడ్డ వేసి ఈ రాయిని అమ్మకానికి పెట్టు, ఎవరైనా ఈ రాయి విలువ ఎంత అని అడిగినప్పుడు నువ్వు ఏమి మాట్లాడకుండా మూడు అని నీ వేళ్ళతో చూపించు, వారు దానికి ఏమీ బదులిచ్చారో తెలుసుకొని వారికి ఆ రాయిని అమ్మకుండా తిరిగి వచ్చెయ్ అని చెప్పాడు.
ఆ అబ్బాయి తండ్రి చెప్పినట్టు చేయగా మార్కెట్లో ఒక పెద్దావిడా ఈ రాయి చూడడానికి చాలా విచిత్రంగా ఉంది దీని విలువ ఎంత అని అడిగినప్పుడు, ఆ బాబు తన మూడు వేళ్ళను చూపించాడు, అది చూసిన ఆ పెద్దావిడ ఇది 30 రూపాయల అని అడిగిందంట, అవును అని అతను బదులు ఇచ్చినప్పుడు ఆమె కొనుక్కోవడానికి సిద్ధపడింది. వెంటనే ఆ అబ్బాయి ఈ రాయికి 30 రూపాయలు విలువ ఉందా అని ఆశ్చర్యపడి ఆ రాయిని తీసుకొని ఇంటికి వచ్చి తండ్రితో జరిగిన దానిని వివరించాడు. తండ్రి మంచిది ఇదే రాయిను రేపు మన పట్టణంలో ఉన్న మ్యూజియంలో పెట్టు అక్కడ కూడా ఎవరైనా దీని విలువ ఎంత అని అడిగితే ఏమి మాట్లాడకుండా నీ చేతి వేళ్లను రెండు లేదా మూడు చూపించు అని చెప్పడంతో, ఆ అబ్బాయి మరుసటి రోజు మ్యూజియములోనికి వెళ్లి అక్కడ ఒక ప్రదర్శనగా పెట్టి నిలవబడినప్పుడు, ఒక వ్యక్తి వచ్చి దీని విలువ ఎంత అని అడిగినప్పుడు యధావిధిగా తన చేతి మూడు వేళ్లను చూపించాడు, దానికి బదులుగా ఆ వ్యక్తి 3000 రూపాయల అని బదులు ఇవ్వడంతో, అవును అని ఈ అబ్బాయి తలాడించాడు. ఆ వ్యక్తి దానిని తీసుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు మరలా ఆ రాయిని తీసుకొని తండ్రి వద్దకు వచ్చి చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ రాయి 3 వేల రూపాయలా దీనికి ఇంత విలువ ఉందా అని తండ్రిని అడిగాడు. తండ్రి దానికి బదులుగా రేపు కూడా నేను చెప్పు మరొక స్థలమునకు వెళ్ళు అక్కడ కూడా దాని విలువ ఎంత చెపుతారో చూద్దాం అని తండ్రి బదులిచ్చాడు.
మరుసటి రోజు తండ్రి తనను బంగారు వ్యాపార వీధిలోనికి వెళ్లి అక్కడ దానిని అమ్మకం కొరకు పెట్టు అని చెప్పడంతో ఆ అబ్బాయి వెళ్లి బంగారు వ్యాపారాల మధ్య దానిని పెట్టడంతో, అక్కడ ఒక వజ్రాల వ్యాపారి ఆ రాయిని చూసి ఆశ్చర్యపడి ఎంత అద్భుతం, నీకు ఈ రాయి ఎక్కడిది, దీనిని ఎంతకు అమ్ముతావు అని చెప్పడంతో యధావిధిగా తన చేతి వేళ్లను చూపించాడు వెంటనే ఆ వ్యాపారి మూడు లక్షల అని అడిగినప్పుడు అవును అని బదులిచ్చాడు. వెంటనే ఆ వ్యాపారి తీసుకోవడానికి సిద్ధపడుతుండాగా క్షమించండి అని చెప్పి ఆ రాయిని పట్టుకుని ఆశ్చర్యంతో తండ్రికి దగ్గరకు వచ్చి డాడీ దీని విలువ ఈరోజు మూడు లక్షలు పలికింది నాకు ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పడంతో, తండ్రి దీనిని బట్టి అర్థం చేసుకో మన విలువ మన కోసము పరిపూర్ణంగా తెలిసిన వారికే తెలుస్తుంది. మా దృష్టిలో మా కుమారునిగా నీ విలువ ఈ లోకంలో ఉన్న సంపదల కన్నా ఎక్కువ అని తండ్రి చెప్పడంతో ఆ కుమారుడు ఆనంద పరవశమయ్యాడు.
గమనిద్దాం ఈ లోకంలో మనకంటూ ఒక విలువ ఉంది. ఈ విలువ మనకు తెలియాలంటే మన విలువను గుర్తించే స్థలంలో మనము పెట్టబడాలి, మన విలువను నిర్దేశించగలిగిన గొప్ప స్థలము దేవుని సన్నిధి. ఎందుకంటే మనము ఆయన వలన సృజింపబడిన వారం, మనలను సృష్టించిన దేవునికి తెలుసు మనము ఎంత విలువైన వారమో. అందుకే మనము మన పాపములు చేత పతనమైపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అమూల్యమైన, విలువైన ఈ సర్వ సృష్టిలో ఎక్కడా దొరకని ఆయన పరిశుద్ధమైన రక్తములో మనలను దేవుడు కొనుక్కున్నారు. దీనిని బట్టి మనం ఎంత విలువైన వారు అర్థమవుతుంది కదా. లోకంలో ఉంటే మన విలువ తెలియదు, మనుషులు మన విలువను గుర్తించలేరు. కొన్ని సందర్భాలలో మన కుటుంబ సభ్యులు, స్నేహితులు నా అనుకున్న వారు కూడా నీ విలువను అంచనా వేయలేరు.
మనుషుల దృష్టిలో దావీదు విలువ తక్కువే, కాని దేవుని దృష్టిలో దావీదు ఘనుడు.
యోసేపు మనుషుల దృష్టిలో తక్కువైన వాడే గాని దేవుని చింత విశ్వాసముతో ఉన్న యోసేపు యొక్క విలువ దేవుని దృష్టిలో చాలా ఎక్కువ.
చివరిగా, నీ విలువ తెలియాలి అంటే నీ దృష్టిలో కాదు, నీ కుటుంబ సభ్యుల దగ్గర కాదు, మార్కెట్లో కాదు, నిన్ను అభినందించే వ్యక్తుల దగ్గర కూడా కాదు. నీ జీవిత విలువ తెలియబడే స్థలం దేవుని పాద సన్నిధి.
* బంగారాలు, అలంకారాలు బట్టి కాదు విలువ సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము(అంతరంగపురుషుడు) మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.
మనుష్యులను బట్టి కాదు విలువ...
మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులుకాకుడి.1కోరింథీ 7:23.
మీ విలువ మీరు తెలిసికొనవలెనని,..
ఎఫెసీ 1:17 - 19
మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో,
ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని,
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.
Elisha Bonnke



Comments