top of page

నిన్నువలె‌‌...

కొన్ని సంవత్సరముల క్రితము మేము, కొంతమంది యవ్వనస్తులు మా సంఘము నుండి ఒక గృహములో జరగనైయున్న కృతజ్ఞత కూడికకు బయలుదేరాము.


మేమందరము కలసి వెళ్లడానికి ముందుగా ఒక యింటి దగ్గర కలుసుకున్నాము. మేము సమావేశమయ్యే సమయానికి ఆకాశమంత దట్టమైన మేఘములను కమ్ముకుని ఉంది. ఈలోపు ఒక సహోదరి సన్ను ఒక వాక్యమునకు వివరణను అడిగింది. ఆ వాక్యమే 'నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము' అన్నది.


నేను దేవుని ఆత్మ సహాయముతో ఈ విధముగా జవాబిచ్చాను. సాధారణముగా గృహ కూడికలు ఏర్పాటు చేసుకున్న వాళ్ల మేడ మీదో లేక యింటి ఆవరణములోనో ఏర్పాటు చేసుకుంటారు. మా సంఘము నుండి గృహ కూడికకు యించుమించు 100 మంది వరకు కూడుకుంటారు. కాబట్టి గృహ కూడికకు వర్షం ఆటంకము ఇవ్వకూడదని అనుకుంటారు. నన్ను వాక్య వివరణ అడిగిన సహోదరికి నేనొక ప్రశ్న వేశాను. ఈ రోజే మీ యింటి దగ్గర గృహ కూడిక అయి యింతగా మేఘాలు పచ్చినప్పుడు నీవేమి చేస్తాను అని? ఆమె ఇలా జవాబుచ్చింది, చాలా కంగారుపడిపోతాము, వర్షం పడకూడదని ప్రార్ధన చేయడం ప్రారంభిస్తాము అని.

వెంటనే నేను బదులిచ్చాను. మన ఇంటి దగ్గర జరిగే కూడికకు ఏదైన ఆంటకం వస్తే మనమెంత కంగారు పడి ప్రార్థనలు చేస్తామో మన పొరుగువారి విషయమైన ఈరోజు కూడికను గూర్చి అంతే ఆతృత కలిగి ప్రార్ధన చేయగలిగితే మనము కూడ నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అన్న వాక్యమును నెరవేర్చిన వారమవుతాము.


అవును మన విషయమై మనము ఎలా ఆలోచించుకుంటున్నామో మన ఎదుట వాని విషయమై అదే ఆలోచన కలిగియుండాలనేది దేవుని చిత్తము. మనల్ని మనము ప్రేమించుకోవలసి వచ్చినప్పుడు చిన్న, పెద్ద, పేద, ధనిక, కులాలు ప్రాంతాలు ఇవేవి అవసరం లేదు. ఇదే భావనలో మన పొరుగువానిని మనము ఏ అడ్డులు లేకుండా ప్రేమించాలి.


నిజముగా మనమివ్విధముగా ఉండగలిగితే ధర్మశాస్త్రమంతయు సంక్షేపముగా ఇమిడియున్న నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యమును నేరవేర్చు వారమవుతాము (రోమా13:8-10, మత్తయి 22:39,40).

ఈ విధముగా దేవుని కొరకు మనము జీవించుదుము గాక.


Elisha Bonnke

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page