నొప్పి అన్నది తెలియకపోతే ?
- oelishabonnke
- Dec 4, 2024
- 1 min read
పేసెంటుకు ఆపరేషన్ అవసరమైనప్పుడు అనస్థీషియా(Anesthesia) ఇస్తారు, మత్తు మందు ఇచ్చి చికిత్స చేసినప్పుడు నొప్పి తెలియదు కదా.
అసలు మానవ శరీరమునకు నొప్పి తెలియకుండ ఉంటే ఎంత బావున్నో అనుకున్నవారు మనలో ఎంతోమంది ఉంటారు, సాధారణముగా మనుష్యులలలో కొంతమంది రక రకలా లోపాలతో కొంతమంది గ్రుడ్డివారిగా, కొంతమంది చెవిటి వారిగా, కొంతమంది కుంటివారిగా, అవయవలోపములు కలిగిన వారుగా పుడుతూవుంటారు.
కొన్ని సంవత్సరముల క్రితము అమెరికాలో అషలీన్ బ్లాకర్ (ASHLYN BLOCKER) అనే అమ్మాయి తన శరీరమునకు నొప్పి అన్నది తెలియకుండా ఉండే తత్వముతో పుట్టింది. పుట్టినప్పటి నుండి ఆ పాప అసలు ఏడవకపోవడముతో ఆమె తల్లితండ్రులు అస్సలు ఏడుపే లేదు అని ఎంతో సంబరపడిపోయారు. కాని బిడ్డ ఎదుగుతూ ఉండగా వారికి తెలిసింది పాపకు నొప్పి తెలియని అరుదయిన వ్యాది ఉందని, చాల భయపడిపోయారు, ఒకసారి వేడి నీటిలో చేయి పెట్టడముతో చేయి కాలిపోయినా ఆ పాపకు బాధ తెలియలేదు. ఏది చల్లనిదో, ఏది వేడిదో, ఏది కోసుకుంటాదో తెలియక శరీరము రక రకలా గాయాల పాలవుతుంది, శరీరం లోపల, బయట ఏ బాధ తెలియడములేదు. ఆ పరిస్థితి ఆమెకు క్షేమము కాదని వైద్యులను ఆశ్రయించారు ఆ తల్లితండ్రులు.
దేవునికి మహిమ కలుగును గాక దేవుడు సర్వజ్ఞాని, మనకు బాధ ఎందుకవసరమో ఆయనకే తెలుసు, దేవుడు ఎందుకిలా చెసారు, ఎందుకిది చేసారో అని మనమనుకుంటే మనమే బుద్ధిహీనులము.
విలాపవాక్యములు3:33
హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము నైనను బాధనైనను కలుగజేయడు.
ఆయన చిత్తములో నిర్మపింపబడినవారముగా మనమున్నట్లయితే, మన విశ్వాసజీవితములో మనకి తెలుస్తున్న బాధలు మనము జాగ్రత్తపడుటకే అని గుర్తించగలగాలి.
దేనిని ముట్టుకుంటే బాధకు గురిచేస్తాదో అన్నంత ఆత్మీయ స్పర్శ కలిగినవారు ధన్యులు.
కీర్తనలు119:71
నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను.
1థెస్స5:21
సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.



Comments