top of page

నేర్చుకున్నవాడే బోధకుడు కాగలడు...

భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి అయిన డా.సర్వేపల్లి రాధాక్రిష్ణన్ గారు. అనేక విశ్వవిద్యాలయాలో పేరుగాంచి అనేకమంది విద్యార్థులకు ఆరాధ్య దైవముగా విశిష్టతను సంపాదించించుకాన్నారు.


ఒకసారి కోలకతా విశ్వవిద్యాలయమునకు ప్రొఫసరుగా వెళ్ళవలసిన సమయమున ఆయన గుర్రపు బండి మీద బయలుదేరినప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్న విద్యార్థులు ఆ గుర్రపు బండి గుర్రాలను విప్పి వారే గుర్రాలుగా అయి ఆ బండిని రైల్వే స్టేషన్ వరకు సాగనంపారు. అంతటి అభిమానమునకు కారణము ఆయన దగ్గర ఉన్న నేర్పరితనం.

ప్రభావమును చూపించగలిగేంత బోధకులు ఈ ప్రపంచములో ఎంతో మంది ఉన్నారు, అది డాక్టరు, ఇంజనీరు, సాఫ్టువేరు ఇలా ఏ స్థాయి అయిన బోధించే వారు ఉంటేనే ఆ రూపము. ఇటువంటి బోధకులను బట్టి దేవునికి స్తోత్రములు.


ఈ లోకంలో ఎన్నో ఉన్నతమైన స్థాయిలను అందించే బోధకులున్నప్పటికీ, ఆయనకు ఒకనికే సాధ్యమైన దేవుడు అన్న స్థాయిని ప్రపంచమునకు బోధించిన బోధకుడు యేసయ్య. ఆయన గొప్ప బోధకునిగా పిలవబడుటక కారణము ఆయన నేర్చుకునే బోధకుడు.


నేర్చుకున్నవాడే బోధకుడు కాగలడు.

హెబ్రీ 5:8

ఆయన,కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను.


ఆయన నేర్చుకున్నవాడు గనుక నేర్పించడానికి సమర్థుడయ్యారు. అనేక మందిని ఆయన బోధల ద్వారా బ్రతికించారు, బ్రతికిస్తూ ఉన్నారు.

మత్తయి 11:28,29

ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.

నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.


ప్రాణమునకు నెమ్మదిని కలిగించే గొప్ప బోధనలను మనకు ఇస్తున్న మన ప్రియ బోధకుడైన యేసయ్యకు వందనాలు చెల్లిస్తూ, టీచర్లు మాదిరిగా పెట్టుకోగలిగే ఆయన ఔన్నత్యమును ఘనపరుస్తూ. ఈ దిన ధ్యానమును మీ ముందుకు తీసుకొస్తున్నాము.


*బ్రతకడానికి కాదు బోధకుడు బ్రతికించడానికే బోధకుడు*


కీర్తనలు 32:8

నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గ మును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను.


Elisha Bonnke

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page