పరిస్థితులతో సంబంధం లేని సంతోషం...
- oelishabonnke
- Dec 4, 2024
- 1 min read
అన్ని బాగున్నప్పుడు అందరూ ఆనందిస్తారు గానీ ఏమి బాగోకపోయినా ఆనందించగలిగినవాడే క్రైస్తవుడు.
ఇండియాలో ఒక ఫేమస్ టీవీ షో kaun banega crorepati కౌన్ బనేగ క్రొర్ పతి.
ఈ ప్రోగ్రాంలో 2011లో బీహారుకు చెందిన సుశీల్ కుమార్ ఐదుకోట్లు డబ్బును గెలుచుకున్న సంగతి అందరికి తెలిసిందే, తను అన్ని కోట్లు గెలవగానే వ్యక్తపరచిన ఆనందము, తనతో పాటు ఆ కార్యక్రమమును టీవీలో వీక్షిస్తున్న వారి యొక్క హావభావాలు, వారి కుటుంబ సభ్యుల యొక్క ఆనందపరవళ్ళు ఇవన్నీ కళ్ళ ఎదుట పొందుకున్న స్థితిలోనుండి వచ్చాయి.
ఇలా అన్ని అనుకూలముగా ఉంటే ఆనందించేవారిని ఈ లోకంలో మనము చూడగలము, కానీ ఆన్ని కోల్పోయినప్పుడు ఉన్న ఆనందమును క్రైస్తవ్యంలోనే చూడగలం.
ఈ లోకంలో బాగా డబ్బున్న వాడు ఒకేసారి సమస్తము కోల్పోతే పిచ్చివాడైపోతాడు, అటువంటి వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. 2011 సంవత్సరంలో ఐదు కోట్లు గెలుచుకున్న ఈ సుశీల్ కుమార్ కూడ అతని జీవితంలో పొందుకున్న ఐదు కోట్లు ఆయా నష్టాల ద్వారా పోగొట్టుకున్నాడు, ఉన్న ఆనందమంతా పోయింది, వ్యసనాల బారిన పడి నా జీవిత పతనమునకు ఈ ఐదు కోట్లు కారణమైందని ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
మన పరిశుద్ధ గ్రంథములో ఊజు దేశమందు ఉన్న యోబు తూర్పు దిక్కునున్న జనులందరి కన్నా మిక్కిలి ధనవంతుడు, నేటి ముఖేష్ అంబానీల కన్నా గొప్పవాడు, యోబు అంతటి గొప్పతనంలో ఉన్నప్పుడు కూడ ఆనందించే ఆరాధికుడిగా ఉండగలిగాడు(యోబు 1:5).
తన ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలతో పాటు సమస్తాన్ని కోల్పోయిన తరువాత కూడా యోబు వ్యక్తపరిచిన ఆరాధన దేవునిలో ఆనందించడం ఎంత విలువైనదో అన్నది కనుపరిచింది.
సమస్తాన్ని కోల్పోయాను అని తెలిసిన వెంటనే యోబు యొక్క హావభావాలు, ఆరాధనా భావం వాక్యములో నుండి...
యోబు1: 20,21,22
అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను,
నేను నా తల్లిగర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక,
ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.
సమస్తము ఉన్నప్పుడు, సమస్తము కోల్పోయినప్పుడు పాపము చేయని ఆరాధికుడు యోబు.
.
దేవుని కన్నా గొప్పది ఏది లేదు అని గుర్తించగలిగినప్పుడు, ఈ లోకములో ఉన్న స్థితిగతుల మీద మన ఆనందము ఆధారపడి ఉండదు. ఏమి ఉన్నా లేకపోయినా దేవుడు అనుగ్రహించే సంతోషం శాంతిని ఎవరు దొంగలించలేరు, ఏదియు దొంగిలించలేదు.
Elisha Bonnke



Comments