top of page

భక్తికి పదును...

ఒక యజమానుడు తన వనములో ఉన్న వృక్షములను పడగొట్టి చక్కని పూల తోట వేద్దామనే ఉద్దేశముతో ఒక పనివానికి ఆ చెట్టులు కొట్టే భాద్యతను అప్పగించాడు. అతడు మొదటిరోజు 10 చెట్టులు వరకు నరికాడు‌. రెండవరోజు 6, మూడవ రోజు 4, నాలుగవ రోజు 2 చెట్టులు మత్రమే కొట్టగలిగాడు. యజమానుడు 5వ రోజు వచ్చి చూసినపుడు,భయముతో ఆ పనివాడు అయ్యా మొదటి రోజు కన్న తరువాత రోజులు నేను ఎక్కువ సమయము చెట్టులు కొట్టడానికి సమయాన్ని కేటాయించిన రోజు రోజుకి సంఖ్య తగ్గిపొయింది నాకేమి అర్థము కాలేదనగానే, ఆ యజమానుడు నవ్వుతూ గొడ్డలికి మొదట ఉన్నంత పదును తరువాత రోజుకి ఉండదు గొడ్డలిని ఏ రోజుకు ఆ రోజు పదును పెడితేనే మొదట ఉన్న పనితనమును చూడగలమని చెప్పాడు.


దేవున్ని ప్రేమించే మొదటి ప్రేమ యొక్క ప్రాముఖ్యతను వాక్యములో మనము చూడగలం.


దేవునిసేవకులు RRK మూర్తి గారు ఒక పాటను వ్రాస్తూ ఏ రోజుకారోజు యేసు రుచులవి క్రొత్త, నేడు నిన్నటికన్నా ఎన్నతరమే కాదా అని ప్రారంభించారు.

మన ఆత్మీయ జీవితములో ఏ రోజుకారోజు పదును కలిగిన భక్తి ఉంటేనే శక్తివంతమైన ఆత్మీయ ప్రయాణమును కలిగిన వారముగా ఉండగలము.


ఎఫెసీ4:23,24

మీ చిత్తవృత్తియందు నూతన పరచబడినవారై,

నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును(మూలభాషలో-నవీన పురుషుడు) ధరించుకొనవలెను.


యెషయా 40:31

యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.


ఇట్టి స్థిరమైన ఆత్మీయ బలమును కలిగి ఉందుము గాక.


Elisha Bonnke

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page