top of page

ముందు చాలా ఉన్నది..

కొలంబస్ అమెరికాను‌ కనుగొనుటకు ముందు అట్లాంటిక్ సముద్రం దాటుటకు స్పెయినుకు సంబంధించిన ఒక ఓడను ఎక్కినప్పుడు, ఆ ఓడపై "నే ప్లస్ అల్ట్రా" అని వ్రాయబడి ఉన్నది. దాని అర్థం "ముందు ఏమీ లేదు" అప్పట్లో ప్రజలు సముద్రము అవతల ఏమీలేదు అంతా నీరే ఉంటాదనే ఉద్దేశం కలిగి ఉండేవారు, కొలంబస్ అమెరికాను కనుగొని వచ్చిన తర్వాత ఆ ఓడ మీద ఉన్న "నే ప్లస్ అల్ట్రా" అనే మాటకు ముందు 'నే' అనే పదమును తీసివేసారు, ఇప్పుడు దానికి అర్థం "చాలా ఉన్నది".


మన ఆత్మీయ జీవితంలో మన ప్రభువు మనకు తెలియజేసిన మర్మము కనిపిస్తున్న ఈ జీవితము, కనిపిస్తున్న ఈ దృశ్యములను మించినది ఒకటి ఉన్నది అది వాడబారనిది లయం కానిది, "ముందు చాలా ఉన్నది" అని తెలియజేసారు..

ముందు చాలా ఉన్నది అని మనం గమనించినప్పుడు అజ్ఞానులుగా ఉండక, జ్ఞానులవలె ప్రస్తుతము చూడలేని ఉన్నదాని కొరకు నిరీక్షణతో కనిపెట్టగలము.


ఫిలిప్పీ3:20

మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.

*మనకు పరలోకములో పౌర స్థితి ఉన్నది

* మనకు పరలోకములో స్థలము ఉన్నది

*మనకు పరలోకములో ఇల్లు ఉన్నది

*మనకు పరలోకములో ఆస్తులు ఉన్నాయి

*మనకు పరలోకములో సహవాసం ఉన్నది

*మనకు పరలోకములో నిత్యజీవం ఉన్నది

*మనకు పరలోకములో ప్రత్యక్షముగా చూడగలిగే దేవుడు ఉన్నారు..


ఇదే మన నిరీక్షణ.. 'ముందు చాలా ఉన్నది" హల్లెలూయ !

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page