మనం కలిగియున్న దానిని?
- oelishabonnke
- Nov 22, 2024
- 1 min read
విశాఖపట్నంలో ఒక యవనస్థుల కూడికలో జరిగిన సంఘటన ఇది. ఆ కూడికలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ దేవుడు మనకు ఇచ్చిన దాన్ని నష్టపోతే ఉన్న బాధ ఎలా ఉంటుందో అన్న దాని కోసం మాట్లాడుతూ.. అదే కూడిక చివరిలో కూర్చున్న ఒక సువార్త గాయకుని జీవితంలో జరిగిన ఒక సంఘటన కోసం చెప్పారు.
విశాఖపట్నములో తనకు తెలిసిన గాయకులలో ఉన్నతమైన స్వర స్థాయిలో పాడగలిగే స్వరాన్ని కలిగినటువంటివారిలో ఈ గాయకుని మించినవారు ఎవరు లేరని అలాంటి ఆ గాయకునికి గొంతు ఇన్ఫెక్షన్ భట్టి ఆపరేషన్ చేయవలసి వచ్చి, ఆపరేషన్ తర్వాత డాక్టర్లు అతన్ని ఎక్కువగా మాట్లాకూడదని చెప్పారని ఇప్పుడు తను ఇంతకుముందులా పాట పాడలేకపోతున్నారు అని చెబుతూవుండగా వెనుక ఈ మాటలు వింటున్న ఆ సువార్త గాయకుని కళ్ళల్లో కన్నీరు కనిపించింది.
అవును మనజీవితాలలో మనము కలిగియున్న దానిని, మనకు విలువను తెచ్చే దానిని మనం కోల్పోతే అది భరించలేని బాధ అవుతుంది. లోకములో మనము కలిగి ఉన్న తలాంతులు కన్నా, ఆస్తుల కన్నా, బంధువుల కన్నా, స్నేహితుల కన్నా, ధనము కన్నా, మనం కలిగి ఉన్న శ్రేష్టమైన భాగ్యం దేవుని కలిగియుండుట.
ఈ లోకపరమైన వనరులను కోల్పోయిన పర్వాలేదు గాని శ్రేష్టుడైన దేవుని కోల్పోతే...,?
న్యాయధిపతులు 16:20
సంసోను దైవ బలాన్ని కోల్పోయినప్పుడు నేను దేవుని బలాన్ని కోల్పోయాను అన్న సంగతి తెలియకుండా.. ఎప్పటిలాగనే విరజిమ్ముకుందును అనుకున్నట్లుగానే ఈ దినాలలో చాలామంది దేవుని కలిగియున్నామనుకుని దేవుడు లేకుండానే ముందుకు వెళ్ళిపోతున్నారు.
నాలో దేవుడు ఉన్నారు అనడానికి సరైన రుజువు ఏమిటి?
నాకు దేవుడిచ్చిన రక్షణను భయముతో వణుకుతో కాపాడుకోగలుగుతున్ననా?
ఈ ప్రశ్నలు వేసుకుంటే వచ్చే జవాబు ఏమిటి?
* ప్రశ్నించుకుందాం
*మేల్కోందాము
*సరిచేసుకుందాం
*జాగ్రత్తను వహిద్దాం.
ఫిలిప్పీ 2:12
భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి.
ప్రకటన3:11
నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.



Comments