యేసు ప్రార్థన జీవితములో...
- oelishabonnke
- Nov 17, 2024
- 1 min read
ప్రార్థన ఎంత విలువైనదో యేసుప్రభువు ప్రార్థన జీవితం ద్వారా మనము గమనించగలము.
1) ఏకాంత ప్రార్ధన (వ్యక్తిగత ప్రార్థన)
మత్తయి 14:23
ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను.
2) ఉదయకాల ప్రార్థన
మార్కు 1:35
ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను.
3) రాత్రికాల ప్రార్థన
లూకా 6:12
ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను.
4) ప్రజల మధ్య ప్రార్థన
లూకా 3:21
ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసుకూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా..
5) భోజనమునకు ముందు...
యోహాను 6:11
యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలు కూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను.
6) ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు..
లూకా 6:12, 13
ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను.
ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను.
7) స్వస్థతకు ముందు లేదా అద్భుతమునకు ముందు
యోహాను 11:41
అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
8) దైవ చిత్తమును గూర్చి
మత్తయి 26:42
మరల రెండవమారు వెళ్లినా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగి పోవుట సాధ్యముకానియెడల, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి..
9) కన్నీటి ప్రార్థన
హెబ్రీయులకు 5:7
శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి,భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను.
10) శత్రువుల కొరకు ప్రార్థన
లూకా 23:34
యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను.
11) మోకాళ్ళ ప్రార్థన
లూకా 22:42
వారి యొద్దనుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్లూని..
12) ఉపవాస ప్రార్థన
మత్తయి 4:2
నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా
మనము ఈ ప్రార్థన మాదిరిని కలిగి ఉన్నామా ?



Comments