రూతు నుండి ప్రకటన వరకు ఉన్న దావీదు
- oelishabonnke
- Nov 24, 2024
- 2 min read
ఎక్కడో రూతు గ్రంథములో ప్రస్తావించబడిన దావీదు పేరు.. ఎప్పుడో జరగబోవు భవిష్యత్తు వరకు ఆ పేరు ప్రస్తావించబడింది.
దేవునికి ఇష్టులుగా, దేవుని హృదయానుసారులుగా జీవించిన వారికి దేవుడు ఇచ్చే ప్రాధాన్యత అంత గొప్పది.
దేవుడు తన కొరకు ప్రస్తావించవలసి వచ్చినప్పుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని గర్వముగా తన యందు విశ్వాసముంచిన తన సేవకులను దేవుడు ప్రస్తావిస్తూనే వచ్చారు.
దేవుని సన్నిధిని జరిగిన దేవదూతల సభలో నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అని సాతానుతో తనయందు భయభక్తులు కలిగియున్న యోబు యొక్క ప్రస్తావన మనకు అందరికీ పరిచయమే.
మనకందరికీ పరిచయమయిన మరొక మాట..
నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. 1సమూ 2:30.
ఇది దేవుడు తనను ఘనపరిచి, ఆయన కొరకు నమ్మకముగా బ్రతికి సేవ చేసిన వారికి దేవుడు ఇచ్చిన ఘనత.
ఫీనెహాసు కోసం దేవుడు అద్భుతమైన మాటను పలికారు...
అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుయాజకుడైన అహరోను మనుమ డును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు, వారి మధ్యను నేను ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుటవలన ఇశ్రాయేలీయుల మీదనుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. సంఖ్యాకాండము 25:10,11.
అటువంటి వ్యక్తుల కొరకు దేవుడు ఎదురు చూసారు, ఏలీ ప్రవక్త తరువాత ఆయన పిల్లలు యాజకులుగా ఉన్న దినాలలో దేవుడు వారి యొక్క అపవిత్ర కార్యాలను బట్టి నిశ్శబ్దమును దాల్చారు.
1సమూయేలు 3:1
బాలుడైన సమూయేలు ఏలీయెదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరుచుగా తటస్థించుటలేదు.
అయితే సమూయేలు మందిములో అడుగుపెట్టిన తరువాత దేవుడు మాట్లాడటం ప్రారంభించారు.
1సమూయేలు 3:21
మరియు షిలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలుమాట ఇశ్రా యేలీయులందరిలో వెల్లడియాయెను.
దేవునికి మహిమ కలుగును గాక!
హెబ్రీ 11 వ అధ్యాయము దేవుని యందు విశ్వాసముంచిన విశ్వాసుల జాబితాతో నింపబడింది.
మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు..
దావీదు నా ఇష్టానుసారుడు..
దానియేలు నాకు ప్రియుడు..
నోవాహు నా ఎదుట నీవే నీతి పరుడువు..
యేసుప్రభువు కూడా శతాధిపతి వంటి వ్యక్తుల విశ్వాసమును గొప్పదిగా వర్ణించారు.
మన ముందు ఉన్నవారు మనకు మాదిరి ఉంచారు, మనకు ఒక ప్లాట్ఫారం వేసారు, ఎలా దేవుని కొరకు జీవించారో నేర్పారు. ఎలా జీవించాలో జీవించి చూపించారు.
నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అన్నంత స్థితిని మన ముందు ఉంచారు.
ఇట్టి విశ్వాసుల జాబితను బట్టి దేవునికి ఎల్లప్పుడూ మహిమ చెల్లించాల్సిందే..
దేవుడే తన సేవకులను, పిల్లలను ఘనపరిచినపుడు మన ఎదుట ఉన్న సహోదరుని మనము తక్కువ చేయకూడదు కదా!
ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును.
యోహాను 12:26.
ఈ ఘనతలో ఆయన పిల్లలు పాలిభాగస్తులు సాతానునికి, విగ్రహములకు ఆయన మహిమను చెందనియ్యడు.
యెషయా 42:8
యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను.
ఆయన పిల్లలు ఘనతనొందుట ఆయనకు ఇష్టము. ఆయన పిల్లలముగా మనము ఆయన ఎదుట తగ్గించుకొనుట అన్నది మనకు ధన్యత.
1తిమోతికి 5:17
బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను.
Elisha Bonnke



Comments