top of page

వినకపోతే ప్రమాదం...

ఒక వ్యక్తి తన మొదటి‌ మ్యారేజ్ యానివర్సరీ రోజున తనకు తెలిసిన ఒక బేకరీ దగ్గరకు వెళ్లి ఈ రోజు నా మొదటి మ్యారేజ్ యానివర్సరీ గనుక ఒక చక్కని కేక్ ఇవ్వండి‌ ఆ కేక్ మీద ఈ రోజు స్పెషలుగా ఒక వాక్యం వ్రాయండి అని చెప్పడంతో, ఆ బేకరీ యజమాని కూడా క్రైస్తవుడే గనుక ఏ వాక్యం వ్రాయమంటారు బ్రదర్ అని అడగగా 1యోహాను 4:18లో ఉన్న మాటను వ్రాయమని చెప్పాడు ఆ వ్యక్తి. ఆ మాటను సరిగ్గా వినని ఆ బేకరీ యజమాని యోహానుసువార్త 4:18లో ఉన్న మాటను ఆ కేకు మీద వ్రాసి ఆ కేకును పార్శిల్ చేసి ఇచ్చాడు. సాయంకాలమున కేక్ కటింగ్ సమయమున ఆ కేకును ఓపెన్ చేసి భార్యను సర్ప్రైజ్ చేద్దామనుకున్న ఆ భర్త ఆ కేక్ మీద ఉన్న వాక్యమును చూసి ఖంగుతిన్నాడు.

ప్రేమలో భయముండదు అన్నమాట 1యోహాను4:18లో ఉన్న మాట అయితే,

నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు అన్న మాట

యోహాను సువార్త4:18లో ఉన్న మాట. ఈ పొరపాటుకు కారణం ఆ బేకరి యజమాని సరిగ్గా వినకపోవడం.


వినడము అన్నది ఎంత ప్రాముఖ్యమైనదో వాక్యంలో చాలా సందర్భాలలో వ్రాయబడి ఉన్నది.


మార్కు4:24

మరియు ఆయనమీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి.


యిర్మియా 25:6

యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకుల నందరిని మీయొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి.


మత్తయి 13:14

మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి...


మత్తయి 13:15

గనుక మీరు వినుటమట్టుకువిందురుగాని గ్రహింపనే గ్రహంపరు...


నాకన్నీ తెలుసు అనుకున్నవాడు వినడానికి ఇష్టపడడు.

నేను తెలుసుకోవాలన్న తపన కలిగినవాడే .వినగలడు


మరి మన సంగతి ఏమిటి❓


మార్కు 4:9

వినుటకు చెవులుగలవాడు వినునుగాక.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page