top of page

వెలకట్టలేని విలువైన స్వరం

డిజిటల్ పేమెంట్స్, ఈ మధ్యకాలంలో మన భారత దేశంలో డిజిటల్ పేమెంట్స్ కోసము అందుబాటులోకి వచ్చిన యూపీఐ యాప్స్ మనకందరికీ పరిచయమే‌. దానిలో ప్రముఖ ఫోన్ పే యాప్ వాళ్లు తమ వ్యాపార లావాదేవీలను అభివృద్ధి పరచుకొనుటకు ఒక్కొక్క సిని పరిశ్రమ నుండి ఒక్కో ప్రముఖ నటుల ద్వారా ఐదు సెకండ్ల వాయిస్ తో చిన్న యాడ్ తీసుకున్నారు. మీరు వంద రూపాయలు ఫోన్ పే చేసారు థాంక్యూ బాస్ అని చెప్పే వాయిస్ చాలా మందికి పరిచయమే. తెలుగులో ఈ వాయిస్ ఇవ్వడానికి సినీ పరిశ్రమ నుండి మహేష్ బాబు అనే నటుడు ఐదు సెకనుల వాయిస్ కి ఐదు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నారు. ఈ లోకంలో కొంతమంది స్వరములకు, కొంతమంది ఉనికికి, కొంతమంది వ్యక్తులకు వారి యొక్క స్థితిగతులను బట్టి ఎంతో విలువ ఉంటుంది.

దేవుని చేత సృష్టింపబడిన వ్యక్తులు యొక్క స్వరమునకు ఈ లోకములో అంత విలువ ఉన్నప్పుడు దేవాది దేవుని యొక్క స్వరముకు ఆయన యొక్క ఉనికికి మనము విలువ కట్టగలమా ? ఈ మాట పలుకుటకు కూడా మనకు అర్హత లేదు.

దేవుని స్వరము బలమైన స్వరము ఆయన స్వరములో ఉత్పత్తి జరుగుతుంది, దేవుని స్వరము ప్రభావము గలది ఆయన స్వరములో అద్భుతాలు జరుగుతున్నాయి.కీర్తనలు 29:4యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది.

 యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును కీర్తనలు 29:5యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును.

పర్వతాలలో ఎదగలిగే బలమైన వృక్షము ఈ దేవదారు వృక్షము.‌ 2వేల నుండి 4 వేల సంవత్సరాలు జీవించగలిగే శక్తి గల వృక్షము దేవదారు వృక్షము. లోతైన వేరులు కలిగి పైన ఆకాశమును అంటునంత ఎత్తు కలది ఈ దేవదారు వృక్షము‌. కీర్తనకారుడు దేవుని స్వరమును కీర్తిస్తూ ఇంతటి బలమైన వృక్షమును విరచునంత బలమైనది దేవుని స్వరం అని చెప్పి దేవుని ఘనపరిచాడు.

కీర్తనలు 29:7యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింప జేయుచున్నది.

కీర్తనలు 29:8యెహోవా స్వరము అరణ్యమును కదలించును యెహోవా కాదేషు అరణ్యమును కదలించును

అది బలమైన స్వరము. కీర్తనలు 68:33

ఆయన స్వరము బ్రతికించేది,ఆయన స్వరము స్థిరపరిచేది, ఆయన స్వరము బాగుచేసేది‌,వెండి బంగారముల కన్నా శ్రేష్టమైనది ఆయన స్వరము,జుంటి తేనే ధారలకన్న మధురమైనది ఆయన స్వరము.

ఇంతటి విలువైన స్వరమును వినగలిగే కృపలోనికి వచ్చిన మనము ధన్యులము.

కీర్తనలు 107:20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపించెను.

దేవునికి మహిమ కలుగును గాక !

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page