top of page

శుభ వాగ్దానములు

మూల్యము చెల్లించలేని, అన్నిటిని మించిన అత్యధికమైనవి, శుభప్రదమైన వాగ్దానములను దేవుడు మనకు అనుగ్రహించారు.

2పేతురు 1:4

ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు.


ఈ వాగ్దానములు దేవుని మహిమ, దేవుని గుణము మరియు దేవుని గుణాతిశయముల నుండి వచ్చినవి.

1రాజులు 8:56

ఎట్లనగా-తాను చేసిన వాగ్దానమంతటినిబట్టి ఇశ్రాయేలీయులగు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషేద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైన తప్పి పోయినదికాదు


నమ్మదగిన దేవుడు ఇచ్చిన వాగ్దానములు ఇవి.

నమ్మదగని వారు చేసిన వాగ్దానాలను మనము నమ్మలేము.

శారా వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచుకొనెను గనుక ఆయన చేసిన వాగ్దానమును పొందుకోగలిగింది. హెబ్రీ 11:11.


దేవుడిచ్చిన వాగ్దానములను మనము పొందుకొనుటకు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది.

అపవాది ఈ వాగ్దానములను మనము పొందుకోకుండా రకరకాల ఆటంకాలు వేస్తాడు, గనుక వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థన అవసరం.


నీ సంతానము సముద్ర ఇసుక రేణువులంతగా దీవిస్తానని దేవుడు అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసాడు, దేవుడిచ్చిన ఈ వాగ్దానమునకు ఇస్సాకు భార్య అయిన రిబ్కా యొక్క గొడ్రాలుతనం అడ్డువచ్చింది. అప్పుడు ఇస్సాకు చేసిన ప్రార్థన ఆ గొడ్రాలు తనమును అధిగమించి దేవుడిచ్చిన వాగ్దానమును పొందుకొనుటకు కారణమయ్యింది.

ఆదికాండము 25:21

ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య యైన రిబ్కా గర్భవతి ఆయెను.


యాకోబు లాబాను యొద్ద నివాసం ఉంటున్నప్పుడు దేవుడు తిరిగి నీ పితరుల దేశమునకు వెళ్లుము నేను నీకు తోడైయుందును అని వాగ్దానమును చేసాడు.

ఆదికాండము 31:3

అప్పుడు యెహోవానీ పిత రుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా..

వాగ్దానమును పొందుకున్న యాకోబు తన పితరుల దేశమునకు తిరుగు ప్రయాణము కట్టాడు.


అయితే, తన అన్న అయినా ఏశావును గూర్చిన భయము ఈ వాగ్దానమునకు ఆటంకమైనప్పుడు..

ప్రార్థన చేయడము మొదలుపెట్టాడు.


ఆదికాండము 32:6, 7

ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగివచ్చిమేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళ్లితిమి; అతడు నాలుగువందలమందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా..

యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి..

ఆదికాండము 32:9 -

అప్పుడు యాకోబునా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధు వులయొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దానుదాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని, నా సహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్త రింపజేయుదునని సెలవిచ్చితివే అనెను.


ఈ ప్రార్థన యాకోబును వాగ్దాన నెరవేర్పుకు తీసుకెళ్ళింది.

ఆదికాండము 33:10

దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని; నీ కటాక్షము నామీద వచ్చినది గదా; అని ఏశావుతో చెప్పే అంత నెమ్మదిని పొందుకున్నాడు.


1రాజులు 18:1

అనేకదినములైన తరువాత మూడవ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై-నేను భూమి మీద వర్షము కురిపింపబోవుచున్నాను, అని దేవుడు వాగ్దానము చేసిన తర్వాత, ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు ఏలియా ప్రార్థన చేసాడు


1రాజులు 18:42

... ఏలీయా కర్మెలు పర్వతముమీదికి పోయి నేలమీద పడి ముఖము మోకాళ్లమధ్య ఉంచుకొనెను.

తద్వారా దేవుడు మోపైన వాన కురిపించి ఆ వాగ్దానమును నెరవేర్చాడు.


దేవుడు మనకు అమూల్యమైన వాగ్దానాలను ఇచ్చారు, పొందుకున్న ఆ వాగ్దానాలు నెరవేరుటకు మనము తప్పక ప్రార్థన చేయాలి.


ఆమెన్.


Elisha Bonnke

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page