సేఫ్టీ పిన్నుతో 80 ఎకరములు భూమి..
- oelishabonnke
- Nov 24, 2024
- 1 min read
1849లో వాల్టెర్ హంట్ అనే వ్యక్తి గుండుసూదులు తయారు చేయు పరిశ్రమలో పని చేసేవాడు, ఆ పరిశ్రమ యజమాని అతని ఆదివారం కూడా పనిలోకి రమ్మని బలవంతం చేయడంతో ఆదివారమునాడు తాను పనిచేయనని, తాను ప్రభువును ఆరాధించుటకు ఆ దినమును ప్రత్యేకపరుచుకున్నానని చెప్పడంతో ఆయన తీసుకున్న ఆ నిర్ణయమునుబట్టి ఉద్యోగమును కోల్పోయాడు.
మరలా ఉద్యోగము దొరకక హంట్ ఆయన కుటుంబం చాలా కష్టాలుపడి ఎంతో బాధపడుతూ ఉండగా, అన్నీ చూస్తున్న దేవుడు, తన తీసుకున్న నిర్ణయంవలన వచ్చిన బాధను చూసి, హంటుకు సమయోచితమైనటువంటి జ్ఞానమును అనుగ్రహించెను, ఆ దినాలలో గుండీలకు బదులుగా గుండుసూదులు వాడేవారు, ఒకరోజు హంట్ తను షర్ట్ బటన్ లేక గుండుసూదిని వాడుతుండగా అది అతని చేతికి గుచ్చుకోవడంతో సేఫ్టీ పిన్ ఒకటి తయారు చేయాలన్న ఆలోచన తనకు వచ్చింది, మొట్టమొదటగా ఒక తీగెతో ఒక సేఫ్టీ పిన్నును తయారు చేసి అది ఉపయోగముగా ఉందని భావించి, ఆ పనిని అభివృద్ధిపరచి గొప్ప వ్యాపార సంస్థగా మార్చాడు. సేఫ్టీపిన్నులు తయారు చేయుటకుగల హక్కులను 400డాలర్లకు అమ్మివేసి ఆ దినాలలో 80 ఎకరముల భూమిని కొనగలిగినంత ఆస్తిపరుడు అయ్యారు వాల్తేర్ హంట్ మరియు ఆయన కుటుంబం.
*మన దేవునికి మనం ఇస్తున్న ప్రాధాన్యతయే మన ఆశీర్వాదమునకు మూలం కాగలగాలి.
* ప్రభువును ఆరాధించుటకు మన త్యాగం కనిపించాలి.
*మన క్రియలే ఆరాధనకు అలంకారములు.
*మన లక్ష్యం దేవుని ఘనపరచడము అని అయి ఉండాలి.
*ఈ ఈ క్రమమే మన క్షేమకరమైన ఆశీర్వాదములకు ద్వారాము.
1సమూ2:30
..కావున యెహోవా వాక్కు ఏదనగా-నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు.
కీర్తనలు 137:5
యెరూషలేమా, నేను నిన్ను మరచినయెడల నా కుడిచేయి తన నేర్పు మరచును గాక.
కీర్తనలు 137:6
నేను నిన్ను జ్ఞాపకము చేసికొననియెడల, నా ముఖ్య సంతోషముకంటె నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచనియెడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక.
Elisha Bonnke



Comments