top of page

సహ+ఉదరము= సహోదరము

ఒకే దేవున్ని ఆరాదిస్తున్న ఒకే తండ్రి పిల్లలం‌ మనము, సహోదరులము మనం.

ఙ్ఞాపకం చేసుకుందాము

సహోదరుడు అనగా సహా+ ఉదరము = సహోదరం. ఉదరము అనగ కడుపు ఒకే కడుపున పుట్టిన వారు సహోదరులు.


ఈ సహోదరులు అన్న పదమునకు నిలయము క్రైస్తవ సంఘ సహవాసం.

మనకందరికీ ఒక్కడే తండ్రి, మనకందరికీ విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే మనమందరం వెళుతున్న గమ్యము కూడా ఒక్కటే.


కాబట్టి గుర్తుంచుకుందాము మనము కలిగి ఉన్న కుటుంబాలు, మనము కలిగి ఉన్న బంధాలు, మనము కలిగి ఉన్న ఈ గుడారాలు ఒకానొక రోజున తప్పకుండా శిధిలమవుతాయి. శిథిలమవ్వబోవు ఈ కుటుంబ వ్యవస్థల మీద, ఈ బంధాల మీద, ఈ గుడారాల మీద శాశ్వతమైన బంధాలను, శాశ్వతమైన కుటుంబాలను, శాశ్వతమైన గుడారములను కట్టుకొనుచున్నాము.


శాశ్వతముగా ఉన్నది సహోదర బంధము మాత్రమే.

యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు తల్లి మరియా క్రీస్తునందులి విశ్వాసము ద్వారా శాశ్వత బంధాన్ని క్రీస్తు సిలువ ప్రేమలో పొందుకున్నారు.


యోహాను 19:26, 27

యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను,

తరువాత శిష్యుని చూచి యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను.


సంఘవిశ్వాసులుగా, సంఘసంవాసులుగా మనము కలిగి ఉన్న సహోదరత్వంలో ఉన్న మాధుర్యాన్ని గుర్తించి దైవ కుటుంబమునకు ఇవ్వవలసిన ప్రాధాన్యతను పరిపూర్ణముగా ఇవ్వాలి.


అప్పుడు అది మేలు మనోహరము అవుతుంది.

కీర్తనలు 133:1 - 3

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!

అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును.

సీయోను కొండల మీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు.


రోమ12:10

సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.


Elisha Bonnke

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page