top of page

సహనమే ఆయుధమైతే...

మదర్ థెరిస్సా గారు సేవ చేస్తున్న ప్రారంభ దినాలలో అతి కష్టముతో అనాధ పిల్లలను పోషిస్తూ ఉండగా, ఒక రోజు ఆ ఆశ్రమములో డబ్బులు లేని పరిస్థితి ఎదురైనప్పుడు థెరిస్సా గారు దగ్గరలో ఉన్న ఒక కిరాణా షాపుకు వెళ్లి, ఆ షాప్ యజమానితో అయ్యా మేము మీకు దగ్గరలో ఒక అనాధ ఆశ్రమము నడిపిస్తున్న సంగతి తెలిసిందే, మీరు ఏమి అనుకోకపొతే పిల్లలకు ఈ రోజు వంటకు సరుకులేమి లేవు ఖాతాగా మీరు ఇవ్వగలిగితే నేను తరువాత బాకీ తీర్చేస్తానని చెప్పారు‌.

ఆ షాప్ యజమాని థెరిస్సా గారిని చూసి చిరాకుతో వెళ్లిపొమ్మన్నాడు, ఆమె ఇంకా నిలవబడి రిక్వెస్ట్ చేస్తుంటే అప్పటికే క్రైస్తవుల అంటే ఇష్టపడని ఆ షాప్ యజమాని థెరిస్సా గారి ముఖము మీద ఉమ్మి వెళ్ళిపోమ్మన్నాడు. అయితే ముఖం మీద ఉమ్మబడిన ఉమ్మిని థెరిస్సాగారు తన ఎడమ చేతితో తుడుచుకొని అయ్యా ఇది నేను తీసుకుంటాను పిల్లలకు సరుకులివ్వండి అని అడిగారు. ఆ షాప్ యజమాని థెరిస్సా గారు చూపించిన దీనత్వమునకు చలించిపోయి అమ్మా నన్ను క్షమించండి మీకు కావలసిన సరుకులు పట్టుకెళ్లండి అని చెప్పి, తరవాత దినాలలో కుడా ఆ షాపునుండి ఉచితముగా నెల నెల సరుకులను పంపారు.


1పేతురు 2:15

ఏలయనగా మీరిట్లు యుక్తప్రవర్తన గలవారై(మేలు చేయువారై), అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము.


యుక్త ప్రవర్తన, సహనము ఎంతటి కఠినమైన వ్యక్తులనైనా సాధుపరచగలవు.

రోమా సైనికులు అంటే కౄర స్వభావముగలవారు వారి హృదయము మెత్తబడటము అసాద్యము, కాని మౌనియై తన్ను బాధించువారి ఎదుట యేసయ్య చూపిన దీనత్వము, సహనము రోమ సైనికున్ని కఠిన హృదయాన్ని మార్చింది.


1పేతురు 2:20

తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును.


మేలు కోసము సహించినప్పుడు తప్పకుండ ప్రతిఫలము పొందుకోగలం, మనము కలిగిఉన్న కుటుంబాలలో, సహవాసాలలో, సమాజములో మన ఆయుధము సహనమే అయితే సమస్తము ఆనందమయమే.


1పేతురు 2: 21

ఇందుకు మీరు పిలువబడితిరి.క్రీస్తుకూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.


Elisha Bonnke

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page