top of page

హృదయ విస్పోటనం

హృదయ విస్పోటనం


1940వ ప్రపంచ యుద్ధ కాలములో డా. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ గారు (Dr. Albert Einstein) యుద్ధ వాతావరణమును ఉద్దేశించి మాట్లాడుతూ ఈ యుద్ధంలో ఉన్న విస్పోటనముల ప్రమాదము కన్నా మనిషి లోపలి స్వార్థం, క్రూరత్వం, బాధ్యతారాహిత్యం ప్రపంచానికి అతిపెద్ద ప్రమాదమని చెప్పారు.

“యుద్ధాలు మనిషి లోపలి క్రూరత్వానికి అద్దం” అని వ్యాఖ్యానించారు.

మనిషి ఆలోచనల లోపం వలన వినాశనం జరుగుతుందని ఆయన భావన.

“సాంకేతిక అభివృద్ధి, మనిషి నైతిక అభివృద్ధిని మించిపోయింది" ఇదే అసలు ప్రమాదమని హెచ్చరించారు.

మనుషుల జ్ఞానము పెరిగిన వారి హృదయం మారకపోతే పెను ప్రమాదాలే చోటుచేసుకుంటాయి అని ఆయన హెచ్చరించారు.


అవును పరిశుద్ధ గ్రంథము మనుషులు యొక్క హృదయ స్వభావమును గూర్చి ముందుగానే హెచ్చరించింది.


మార్కు 7:21 - 23

లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును

నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును, దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును.

ఈ చెడ్డ వన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్ర పరచునని ఆయన చెప్పెను.


మనుష్యులను నాశనము చేస్తున్నవి మనుష్యులలో నుండే బయటికి వస్తున్నాయి.

కుటుంబాన్ని నాశనం చేసే పరిస్థితులు కుటుంబ మనుష్యుల హృదయాలలో నుండి బయటకు వస్తున్నాయి.

సంఘమును పాడు చేస్తున్న పరిస్థితులు సంఘ మనుష్యుల హృదయములనుండి బయటకు వస్తున్నాయి.


మనుష్యుని యొక్క హృదయము ఘోరమైన వ్యాధి కలది. ఈ మాట విశ్వాసులముగా మనకందరికీ బాగా పరిచయమున్న మాట. అయితే ఇదే మాట మన వ్యక్తిగత పరీక్షలో అరుదైన మాటగా కనబడుతుంది.


అద్దములో అనుదినము మనలను మనముషచూచుకొనుచున్నట్లుగా, వాక్యములో మనలను చూసుకున్నప్పుడు మన హృదయ పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది.


సమస్యకు పరిష్కారము మన హృదయ మార్పులోనే దాగి ఉన్నది అన్నమాటను మనము జ్ఞాపకం చేసుకుందాం.

కుటుంబంలో ఉన్న అసమాధానమునకు కారణమేమిటో, సంఘములో ఉన్న విభేదాలకు మూలమేమిటో, అనేకమైన చెడులకు నిలయమేమిటో ప్రత్యక్షపరిచే వాక్య అద్దములో మన హృదయమును ప్రత్యక్షపరచుకోవాలి.


ఈ లోకంలో అనేకమైన క్రూరత్వములకు, ఉగ్రవాదమునకు, హింసకు, తీవ్రవాదమునకు మూలము మనుష్యుని యొక్క హృదయమే.


దీనికి అతీతముగా దేవుడు తన వాక్య సారములో పవిత్రపరచబడిన హృదయములను దేవుడు మనకు అనుగ్రహించారు.

1తిమోతికి 1:5

ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసమునుండియు కలుగు ప్రేమయే.


ఈ పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి వచ్చు ప్రేమ మన కుటుంబములకు, మన సంఘములకు, మన సమాజమునకు మన వ్యక్తిగత ఆత్మీయ క్షేమమునకు మూలము.


అట్టి హృదయములతో లోకమునకు అతీతంగా సంతోష సమాధానములో మనమందరము వర్ధిల్లాలి.


-Elisha Bonnke

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page