హాయ్ భోజనం చెసారా...
- oelishabonnke
- Nov 16, 2024
- 1 min read
ఈ అంశమును చదువుతున్న సమయమునకు మీరు భోజనము లేక అల్పాహారం చేసి ఉండొచ్చు లేక చేయవలసి ఉండొచ్చు, ఏమైనప్పటికి మనం ఇంతకుముందు తీసుకున్న ఆహారం కోసం ఆలోచిద్దాం, అదేనండి ఏమేమి తిన్నామో గుర్తు తెచ్చుకుందాము. సాధారణముగా మనము తీసుకుంటున్న ఆహరంలో ధాన్యము, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసకృతులు, చేపలు, పండ్లు ఇంకా చిన్న చిన్న ఆవాలు, జీలకర్ర ఇలా చెప్పుకుంటూ పోతే కేవలము మనము తీసుకునే ఒక పూట ఆహారంలోనే 10 నుండి 20 వరకు ఉన్న రకరకాల సరుకులను తీసుకుంటాము. మనము తీసుకుంటున్న ఈ 20 సరుకుల ఏర్పాటు కొరకు ఎంతమంది పనితనము అవసరమున్నదో, ఎంత ద్రవ్యము కావాలో, ఎంత భూమి అవసరమో గమనిద్దాం.
ఎంత అద్భుతము అంటే, ఒక పూట మనము తీసుకునే ఆహారం కోసము కొన్ని వందల మంది పనితనం, కొన్ని వేల రూపాయల ఖర్చు, కొన్ని ఎకరాల భూమి ప్రమేయము ఉందన్నమాట.
ధాన్యము పండించడానికి కొందరు, పప్పులు కాయగురాలను పండించడానికి కొందరు, పండించినవి ఏ రైలు బండిమీదో, ఏ రైతు బజారు బస్సు మీదో తెచ్చిన వారు కొందరు, ఇలా మనము ఒక పూట తీసుకునే ఆహారం కొరకు అనేక మంది పనివారిని పెట్టి అనేక విధములుగా మనకు అహారమును సిద్దపరుస్తున్న మన దేవుని పని ఏర్పటు అమోఘం.
రాబోయే దినాలలో మనం తీసుకోబోవు ఆహారం కొరకు దేవుడు ఇప్పుడు పని జరిగిస్తున్నారు, ఆహారము ఎక్కడ సిద్ధపడుతుందో మనకు తెలియదు కానీ దేవుడు మన కొరకు ఆహారమును సిద్ధపరుస్తున్నారు, మన ఆహారం ఇప్పుడు కుడా ఎక్కోడో సిద్ధపాటులో ఉంది కదా.
ఆయన సెలవు లేక బోజనము చేసి సంతోషించుట ఎవరికి సాద్యము? ప్రసంగి 2:25.
మనకోసమే సమస్తాన్ని సిద్దపరిచిన దేవునికి, మన అవసరములను తీరుస్తున్న దేవునికి కృతఙ్ఞతలు చెల్లిస్తూ ఆయన మనకు ఇస్తున్న సమస్త వనరులను పుచ్చుకొనవలసినవారమై యున్నాము, మన నుండి దేవుడు కోరుకుంటున్నది కృతఙ్ఞత కలిగిన జీవితము మాత్రమే.
ఆహారం, పానీయము ఏది తీసుకుంటున్న కృతఙ్ఞత చెల్లించి తీసుకోవడము దేవుని పిల్లలుగా మన తండ్రికి మనం యిచ్చే ఘనత, అది మనకు దీవెన.
ఆహరమును తీసుకుంటున్నప్పుడెల్లా ప్రభువుని స్మరిస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుదము.
1తిమోతికి 4:3,4
ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహము నిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు.
దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపతగినది కాదు.
మత్తయి 6:11
మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.
Elisha Bonnke


Comments